నంద్యాల‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌చారం ప్రారంభం

నంద్యాల‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం కొద్దిసేప‌టి క్రిత్రం ప్రారంభ‌మైంది. ప‌ట్ట‌ణంలోని బొమ్మ‌ల‌స‌త్రం సెంట‌ర్‌లో జాతీయ జెండాను ఎగుర‌వేసిన వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టారు. బొమ్మలసత్రం జంక్షన్‌ నుంచి నునెపల్లి ఫ్లైఓవర్‌, కోవెలకుంట్ల జంక్షన్‌ వరకు జ‌న‌నేత‌ రోడ్‌షో సాగనుంది. తిరిగి బొగ్గులైన్‌ మీదుగా గాంధీనగర్‌, ఎస్సీ కాలనీ, గాంధీనగర్‌ చౌరస్తా, ఇస్లాంపేట.. మూలసాగరం శివాలయం సర్కిల్‌, విశ్వాసపురం, జ్ఞానపురం కాలనీ, వైఎస్‌ ప్రభుదాస్‌రెడ్డి వీధి, పొగాకు కంపెనీ రోడ్డు మీదుగా.. మూలసాగరం, విశ్వాసపురం (చిన్నచర్చి) రోడ్డు వరకు వైయ‌స్‌ జగన్‌ ఉప ఎన్నికల ప్రచారం సాగనుంది.

Back to Top