వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి రెండో రోజు పాద‌యాత్ర ప్రారంభం

వైయ‌స్ఆర్‌ జిల్లా : వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టారు. ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా వైయ‌స్ఆర్‌సీపీ తాజా, మాజీ ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి చేపట్టిన ఈ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. తొండురూ మండలం బుచుపల్లె నుంచి మొదలైన ఈ పాదయాత్ర కృష్ణంగారిపల్లి వరకు కొనసాగనుంది. ఈ నెల 24న మాజీ ఎంపీ అవినాష్‌ రెడ్డి, మాజీ మంత్రి వైయ‌స్‌ వివేకానందరెడ్డి   పైడిపాలెం జలాశయం వద్ద వైయ‌స్ఆర్‌  విగ్రహానికి కృష్ణా జలాలతో అభిషేకం చేశారు.అక్క‌డి నుంచి ప్రారంభ‌మైన పాద‌యాత్ర రెండో రోజు విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పులివెందుల వ‌ర‌కు ఈ యాత్ర సాగ‌నుంది.


Back to Top