బ‌రితెగించిన ప‌చ్చ త‌మ్ముళ్లు

క‌డ‌ప‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేట‌ర్‌పై దాడి
నిందితుల‌ను వ‌దిలి వైయ‌స్ఆర్ సీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు
వైయ‌స్ఆర్ జిల్లా: రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయి. నిత్యం ఏదో ఒక‌ ప్రాంతంలో వారి ఆగ‌డాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలకు కూడా టీడీపీ నేతలు వెనుకాడడం లేదు. తాజాగా వైయ‌స్ఆర్ జిల్లాలో బ‌రితెగించిన ప‌చ్చ త‌మ్ముళ్లు వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేట‌ర్ సురేష్‌పై భౌతిక దాడికి పాల్ప‌డ్డారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడి అనుచరులు విచక్షణారహితంగా కార్పొరేటర్‌పై దాడి చేసి గాయ‌ప‌రిచారు. క‌డ‌ప కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గెలిచిన సురేష్ కొద్ది రోజు కిందట టీడీపీలో చేరారు. టీడీపీ నేతల వైఖరి నచ్చక సురేష్ తిరిగి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి ఇటీవ‌ల చేరారు. దీంతో తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలే సురేష్‌పై దాడి చేశారు. కార్పొరేటర్‌పై దాడిని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌ర‌ ఎమ్మెల్యే అంజాద్ భాషా, మేయర్‌ సురేష్ బాబు అడ్డుకోబోయారు. ఈ ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాడి చేసిన టీడీపీ నేతలను వదిలేసి..వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌పై నేత‌ల‌పై అక్రమ కేసులు బనాయించారు. పోలీసులు తీరుపై స్థానికులు, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top