ఎన్నికల కోడ్‌ అమలు లో పచ్చపాతం

సోమశిల: అధికారులు అధికార పార్టీ వాళ్ల మెప్పు కోసం ఎంతటి పని చేసేందుకైనా వెనుకాడడంలేదు. నెల్లూరు జిల్లాలో శాసన మండలి  ఎన్నికలు కోడ్‌  అమలు చేయడంలో అధికారులు పచ్చపాతం చూపుతున్నారు. అనంతసాగరం మండలంలోని సోమశిల బస్టాండు సెంటరులో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ముసుగు కప్పారు కానీ అదే బస్టాండు సెంటర్‌లో టీడీపీ పతాక స్థంభం వద్ద ఉండే మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు ఫ్లేక్సీ మాత్రం తొలగించలేదు. ఈ విషయంపై అనంతసాగరం తహసిల్దార్‌ ఎంసీ కృష్ణమ్మ  వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు  చేపడతామన్నారు. పార్టీలకు సంబందించి ఎలాంటి ప్రకటన ఫ్లెక్సీలు ఉండేందుకు వీల్లేదని చెబుతున్నారు. 

Back to Top