శివాల‌యంలో య‌డం బాలాజీ పూజ‌లు

ప్ర‌కాశం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల యాదవపాలెంలోని శివాలయంలో మహాశివుని అన్నాభిషేక కార్యక్రమంలో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త య‌డం బాలాజీ  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంత‌కుముందు చౌడేశ్వరి అమ్మవారి జ్యోతి మహోత్సవంలో భాగంగా  బండారు నాగనందం నివాసములో నిర్వ‌హించిన‌ ప్రత్యేక పూజల్లో య‌డం బాలాజీ పాల్గొన్నారు. ఆయ‌న వెంట పార్టీ నాయ‌కులు ఇందేటి జితేంద్ర యాదవ్ ; కోరబండి సురేష్గా ; పిన్నిబొయిన రామకృష్ణ ; చల్లా శివాజీ; యడం రవిశంకర్  ; కట్టెడి వాసు  తదితరులు ఉన్నారు 

Back to Top