పార్టీ పటిష్టం కోసం కృషి చేయండి

► ప్రజాసమస్యల పట్ల అంకితభావంతో వ్యవహరించండి
► వైయస్సార్‌సీపీ శ్రేణులకు అధ్యక్షులు వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం  

కడప: ‘ప్రజల కోసం, పార్టీ కోసం చిత్తశుద్ధితో కృషి చేయండి. ప్రజాసమస్యల పట్ల అంకితభావంతో వ్యవహరించండి. గడప గడపకు వైయస్సార్‌ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా కొనసాగించండి, గ్రామ కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వండి’ అని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వైయస్సార్‌ జిల్లా వైయస్సార్‌సీపీ నాయకులతో  హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి, పార్లమెంటుసభ్యులు వైయస్‌ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీనియర్‌ నేత మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, కడప మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి కల్లూరు నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని, గ్రామ కమిటీలు తప్పనిసరిగా వేయాలని వైయస్ జగన్ ఈ సందర్భంగా సూచించారు. గడప గడపకు వైయస్సార్‌ కార్యక్రమం ఆయా నియోజకవర్గాల్లో క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూనే ప్రజా సమస్యలు సైతం పరిష్కరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామ కమిటీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. 
Back to Top