ఖాళీ బిందెలతో మహిళల నిరసన


అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం తాగడానికి గుక్కెడు నీరు ఇవ్వడం లేదని రుద్రంపేట గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు వైయస్‌ జగన్‌ మద్దతు తెలిపారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ రుద్రంపేట గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఖాళీబిందెలతో వచ్చి వైయస్‌ జగన్‌కు తాము ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. మంచినీరు లేదని ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రుద్రంపేట మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గ్రామాన్ని ఓటింగ్‌ కోసమే వినియోగించుకున్నారే తప్ప సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. తాగేందుకు నీరు లేదని, బిందె నీరు పది రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. గ్రామం పక్కనే పైప్‌లైన్‌ వెళ్తుందని, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాలేజీకి నీరు వెళ్తుందని, మా గ్రామానికి నీరు ఇవ్వడం లేదని మహిళలు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఉన్న ఫ్లోరైడ్‌ నీరు తాగి రోగాల బారీన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి సమస్య లేకుండా చేస్తామని వైయస్‌ జగన్‌ మహిళలకు మాట ఇచ్చారు.
 
Back to Top