మా కోసం మీరింత కష్టపడుతున్నారు

కృష్ణా జిల్లా: మా కోసం మీరింత కష్టపడుతున్నారని సిరిగిపాటి చంటెమ్మ వైయస్‌ జగన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. మీరొస్తే మాలాంటోళ్లకు మేలు జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పెరికగూడెంలో బుధవారం నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సిగిరిపాటి చంటెమ్మ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. ఇల్లు కూడా కట్టుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి బాగోలేక ఆ ఇల్లు కూడా అమ్ముకున్నాం. ఈ పాలనలో టీడీపీ సభ్యత్వం ఉంటేనే ఇల్లు ఇస్తామంటున్నారు. మేము దేవుడిని నమ్ముకొని బతుకుతున్నాం. యేసు ప్రభు ఏవిధంగా మానవాళి కోసం ఎంత హింసలు పొందారో..అలాగే మీరు కూడా కష్టపడుతున్నారు. మంచి మాటలు మాట్లాడుతున్నారు. ఇదే అదరణ కడవరకు మీలో ఉండి..ప్రభు అందరి కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు. పదవుల కోసం మీరు వస్తున్నారని మేము నమ్మడం లేదు. మా కోసం మీరింతగా కష్టపడుతున్నారు. మీపై విశ్వాసంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. ఆత్మీయ శక్తి కావాలి. పేదరికం పోవాలంటే అందరం ఐక్యంగా ఉండి జయించాలి. ఆయన పోయాడు..ఆయన కొడుకుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వేదనతో చెబుతున్నాను. మనందరం ఆయనకు అవకాశం ఇద్దాం. 
– ––––––––––––– 
రామచంద్రరావు, రిటైర్డు వార్డెన్‌ 
హాస్టల్‌ వార్డెన్‌గా చేశాను, దళితులకు శ్మాశానాలు లేవు. కాల్వ గట్లపై, రోడ్లపై మృతదేహాలను పూడ్చి వేయాల్సి వస్తోంది. 
వైయస్‌ జగన్‌:శ్మాశాన వాటిక సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను.
–––––––––––––––––––––––––––
రాష్ట్రంలో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని ఇప్పటికే మీకు వినతిపత్రం అందజేశాను. 2016లో చంద్రబాబు దళితుల గురించి మాట్లాడిన తీరుపై ఆయన దిష్టిబొమ్మలను తగులబెట్టారు. దారుణంగా కేసులు పెట్టింది వేధిస్తున్నారు. 

వైయస్‌ జగన్‌: అక్రమ కేసుల విషయంలో తోడుగా ఉంటాం. మన ప్రభుత్వం వచ్చాక ఈ కేసులను ఉపసంహరించుకునేలా చూస్తాం
–––––––––––––––––––
నాన్నగారి హయాంలో త్రిపుల్‌ ఐటీ పెట్టారు. మీరు ఏం చేస్తారో చెప్పండన్నా..అర్హత ఉన్న విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారు. 
వైయస్‌ జగన్‌: ఏమేమి మార్పులు చేస్తే బాగుంటుందో చూసి ఆధ్యాయనం చేస్తాం
––––––––––––––
విజయ్‌కుమార్‌
దళితుల ఆత్మీయ సమ్మేళనం అని ఏ రాజకీయ నాయకుడు పెట్టలేదు. ఎస్సీలు నాన్నగారి సమయంలో బాగా చదివారు. స్కాలర్‌షిపులు టీడీపీ పాలనలో అందడం లేదు. ఎస్సీ హాస్టల్స్‌ మూత వేశారు. మీరు సీఎం అయ్యాక దళితులకు అండగా ఉండాలి కోరుతున్నాను.
వైయస్‌ జగన్‌: తప్పకుండా అండగా ఉంటాను. 
––––––––––––––––––
భాను రాజశేఖర్‌
 అన్నా..నేను బీ టెక్‌ చదివాను. ఎలాంటి ఉద్యోగాలు లేవు. స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేసి ఉద్యోగాలు పొందేలా చర్యలు తీసుకోండి అన్నా..
వైయస్‌ జగన్‌: దళితులు గొప్పగా చదువుకునేందుకు అండగా ఉంటాను. స్టడీ సర్కిల్‌ పూర్తిగా సపోర్టు చేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో తెలుగు అన్నది కంపల్స్‌సరి చేస్తాం. 
–––––––––––––––––
లేళ్ల ప్రసాద్‌
ప్రతి నిరుపేద రెండు పూటల భోజనం చేయాలని ఆనాడు వైయస్‌ రాజశేఖరరెడ్డి భూములు పంపిణీ చేశారు. ఇవాళ చంద్రబాబు దళితులకు ఒక్క ఎకరా కూడా భూమి ఇవ్వలేదు. నాన్నగారి ఆశయాల మేరకు ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు భూమి ఇవ్వాలి. అలాగే చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి
––––––––––––––––––––––
రవిరాజు
దళితులకు నిజమైన స్వేచ్ఛ ఆర్థికంగా ఎదిగినప్పుడే వస్తుంది. మీరు సీఎం అయ్యాక ఎస్సీలకు భూముల పంపిణీపై మొదటి సంతకం చేయాలని కోరుతున్నాను. దళితులు ఐక్యంగా ఉండాలని మీరు పేర్కొనడం సంతోషకరం. దళితులకు పదవుల్లో పెద్ద పీట వేయాలి. 

వైయస్‌ జగన్‌: దళితులకు సంబంధించిన భూములు ఎవరు లాక్కోకూడదు అన్నట్లుగా బలమైన చట్టాలు తీసుకువస్తాం. రేపుపొద్దున ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తే..ప్రయివేట్‌ వ్యక్తుల కంటే అధికంగా ఇచ్చేలా చూస్తాం. పేదవాడి రాజ్యం వస్తుంది. పేదలకే పెద్దపీట వేస్తాం.
–––––––––––––––––
మండవెళ్లి మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీలు, సర్పంచ్‌లు అందరూ వైయస్‌ఆర్‌సీపీ నేతలే గెలిచారని ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు. జన్మభూమి కమిటీలు పెత్తనం చెలాయిస్తున్నారు.
వైయస్‌ జగన్‌: జన్మభూమి కమిటీల ఆధిపత్యం ఎక్కువైంది. ఈ పరిస్థితి మార్చుతాం. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక గ్రామ సచివాలయాలను తీసుకువస్తాం. మీ గ్రామానికి చెందిన 10 మందికి ఉద్యోగాలు ఇస్తాం. మీకు పింఛన్లు కావాలన్నా..రేషన్‌కార్డు,, ఇళ్లు కావాలన్నా ఎవరికి కూడా లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 72 గంటల్లోనే ప్రభుత్వ పథకాలు మంజూరు అయ్యేలా చేస్తాం. ఇందులో కులాలు, పార్టీలు చూడం. అర్హులందరికీ మేలు చేస్తాం. 
––––––––––––––––––––––

 

తాజా ఫోటోలు

Back to Top