నారాకు బదులు ‘సారా’అని మార్చుకో

  • కొత్త ఎక్సైజ్‌ పాలసీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌
  • రాజధాని నడిబొడ్డున దీక్షకు పూనుకున్న మహిళామణులు
  • చంద్రబాబు పతనం ఈ రోజు నుంచే మొదలైంది
  • వైయస్‌ఆర్‌ సీపీ మహిళా నేత, కార్పొరేటర్‌ పుణ్యశీల
విజయవాడ: చంద్రబాబు తన పేరును నారాకు బదులు సారా చంద్రబాబుగా మార్చుకుంటే బాగుంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా నేత, కార్పొరేటర్‌ పుణ్యశీల అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కొత్త ఎక్సైజ్‌ పాలసీని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలో వివిధ పార్టీల మహిళా నేతలు, ప్రజా సంఘాల సభ్యులు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అధికారంలోకి రాగానే బెల్ట్‌షాపులు రద్దు చేయిస్తాం అని చెప్పిన చంద్రబాబు సిగ్గులేకుండా న్యూ ఎక్సైజ్‌ పాలసీ తీసుకొచ్చి మహిళలను రోడ్డున పడేయడానికి దుర్మార్గపు చర్యకు పూనుకున్నాడన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ. 10 వేల కోట్ల మద్యం ఆదాయం ఉంటే రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీలో మద్యం వల్ల ఏడాదికి రూ. 12 వేల కోట్లు వస్తుందన్నారు. 

అంటే చంద్రబాబుకు మద్యం పాలసీపై ఉన్న ఇంట్రస్టు మహిళా సాధికారతపై లేదని మండిపడ్డారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసి హైవేలపై కూడా మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తూ మహిళల కన్నీటికి కారణం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఇంటి యజమాని మద్యానికి బానిసైతే ఆ కుటుంబం ఏ విధంగా చిన్నాభిన్నం అవుతుందో మీకేం తెలుసు చంద్రబాబు అని ప్రశ్నించారు. చంద్రబాబుకు పాలసీలకు వ్యతిరేకంగా మహిళలంతా నిరాహార దీక్షకు పూనుకున్నారంటే ఆయన పతకం ఈ రోజు నుంచే మొదలైందని హెచ్చరించారు. 
Back to Top