ఐఏఎస్లకు చంద్రబాబు ట్రైనింగా...అంబటి రాంబాబు

హైదరాబాద్: స్థానిక సంస్థల అధికారాలను హరించేలా ఉన్న జీవో నెంబర్ 44ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల గొంతునొక్కే జీవో అని ఆయన బుధవారమిక్కడ అన్నారు. చీకటి జీవోను రద్దు చేయకుంటే వైఎస్ఆర్ సీపీ పోరాటం చేస్తుందని అంబటి హెచ్చరించారు.

కలెక్టర్లకు కూడా చంద్రబాబు నాయుడు పచ్చచొక్కాలు వేసే కార్యక్రమం చేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఐఏఎస్లకు చంద్రబాబు శిక్షణ ఇవ్వడం దారుణమన్నారు. చంద్రబాబుకు అత్యంత అవినీతిపరుడనే ముద్ర ఉందని ఆయన గుర్తు చేశారు. శిక్షణా తరగతుల్లో పాల్గొనడం చూస్తే సివిల్ సర్వీసెస్ స్థాయి దిగజారినట్లు అనిపిస్తోందన్నారు. విదేశాల గొప్పతనం మనకొద్దని...అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చంద్రబాబుకు ఈసందర్భంగా అంబటి రాంబాబు హితవు పలికారు.

తాజా వీడియోలు

Back to Top