కేసులు.. సూట్‌ కేసులతో గెలవగడం అసాధ్యం

వైయస్‌ఆర్‌ జిల్లా:  కేసులు పెట్టి బెదిరించడం, సంతలో పశువుల్లా ఎంపీటీసీలను కొనడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం అసాధ్యం అని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. పట్టణంలోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ ప్రముఖ నాయకులు, మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి పేరును పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించినపుడే సగం గెలిచామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో 400 పైచిలుకు ఓట్లు తమకు ఉన్నాయని, టీడీపీ శిభిరంలో ఉన్న వారు కూడా మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. అత్యంత సౌమ్యుడు, వినయుడు, ప్రజా నాయకుడు అయిన వివేకానంద రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని మేము ప్రయత్నిస్తుంటే టీడీపీ మాత్రం పరువుకోసం పాకులాడుతోందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికలలో రెండు పార్టీలు ఒకటైనా తమ పార్టీ విజయాన్ని అడ్డుకోలేకపోయారన్నారు. ఆ రెండు పార్టీలది బలుపు కాదు వాపు అని తేలినా వారు దానిని కప్పినెట్టే ప్రయత్నం మానుకోలేదని దుయ్యబట్టారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి నాయకత్వాన్ని జిల్లా అంతటా బలపరుస్తున్నారని, ఇప్పుడు ఎవరు ఎన్ని చేసినా దానిముందు దిగదుడుపే అన్నారు. జిల్లా అంతటా దివంగతనేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాలను, నాయకత్వాన్ని కోరుకున్న వారే ఉండడంతో ప్రత్యర్ధులు సరైన అభ్యర్థినే నియమించుకోలేకున్నారని ఆరోపించారు. దనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న ఎంతమందిæడీపీలోకి వలసలు వెళ్లినా తమకు ఎటువంటి డోకా ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రజల తరుపున , రైతుల తరుపున తమ పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ తమదేననడంలో సందేహం లేదన్నారు. జన్మభూమి కార్యక్రమాలలో ప్రజలకు రేషన్‌ కార్డులు ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడేమో సాఫ్ట్‌వేర్‌ ప్రాబ్లమ్‌ అని మాట దాటేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం పుల్లంపేట మాజీ మండలా«ధ్యక్షులు ముద్దా బాబుల్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని దారిద్య్రం వైపు తీసుకెళుతున్న నాయకులు చెబితే ఓట్లు రావన్నారు. ఆ పార్టీ ద్వందౖÐð ఖరిని నమ్మేవారు లేరని, ఈ ఎన్నికలలో బుద్దిచెబుతారని తెలిపారు. ముఖ్యంగా అధికార పార్టీ చెప్పే కాకమ్మ కథలు వినడానికి ప్రజలు సిద్దంగా లేరన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్‌ సీహెచ్‌ రమేష్, నియోజకవర్గ అధికార ప్రతినిది ఎం నాగేంద్ర, ఓబులవారిపల్లె మాజీ మండల కన్వీనర్‌ సాయి కిషోర్‌ రెడ్డి, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ఈ మహేష్, వార్డు సభ్యులు సుదర్శన్‌ రాజు, పార్టీ నాయకులు రామకృష్ణయ్య, యానాదిరెడ్డి, శేఖర్, సుబ్బరామిరెడ్డి, గంగయ్య, డీవీ రమణ, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top