జగన్‌తో ఆపై పార్టీలో చర్చించి నిర్ణయం

హైదరాబాద్ 08 జూలై 2013:

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్కాల్ అంశంపై పార్టీ అధ్యక్షుడు  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డితో చర్చిస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్వవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ ఎమ్.వి.  మైసూరారెడ్డి చెప్పారు. అనంతరం పార్టీలో చర్చించే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని సోమవారం మీడియాకు తలిపారు. రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా 30 ఎంపీ సీట్లను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని మైసూరా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతోదన్నారు. జాతీయ రాజకీయాల్లో కలసి పనిచేద్దామంటూ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వై.యస్. విజయమ్మతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం ఫోన్‌ చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే.

Back to Top