ఓటుకి కోట్లు కేసు నుంచి తప్పించుకొనేందుకు యత్నాలు మొత్తం యంత్రాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్న వైనం పరాకాష్టకు చేరిన అధికార దుర్వినియోగం మాజీ, తాజా అధికారుల సేవలు
హైదరాబాద్) బెదిరించటం, భయపెట్టడం, తప్పు దారి పట్టించటం అజెండా గా పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఓటు కి కోట్లు కుంభకోణంలో పూర్తిగా ఇరుక్కొన్న చంద్రబాబును.. తనను బయటకు లాగటమే లక్ష్యంగా అన్ని వ్యవస్థల్ని మభ్య పెడుతున్నారు. అసలు విషయాన్ని పక్క దారి పట్టించేందుకు ఉన్న అన్ని దారుల్ని ఉపయోగించుకొంటున్నారు.

అర్థరాత్రి హైడ్రామా

మొట్టమొదట చంద్రబాబు ఆడియో సంభాషణల్ని ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానెల్ కు ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. విశాఖలో ఒక న్యాయవాది దాఖలు చేసిన ప్రైవేటు కేసు మీద ఈ నోటీసులు జారీ చేశారు. అక్కడి ఏసీపీస్వయంగా హైదరాబాద్ వచ్చి ఈ నోటీసుల్ని అందించారు. ఎదురు దాడి ప్రారంభం అయిందన్న సంకేతాలు ఇచ్చేందుకే ఈ నోటీసులు జారీ చేశారన్న మాట వినిపించింది. దీనిపై జర్నలిస్టులు, న్యాయవాదులు ధర్నా కు దిగారు.

టీ టీడీపీ నేతలే బలిపశువులు

ఈ పరిణామాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ తెలంగాణ నేతలతో సమావేశం అయ్యారు. సీనియర్‌నేతలు ఎర్ర బెల్లి దయాకర్‌రావు, వేంపల్లి నరేందర్ రెడ్డి, గరికిపాటి రామ్మోహన్ ఈ భేటీలో పాల్గొన్నారు. టీన్యూస్ కు నోటీసులు, ఇతర పరిణామాలపై చర్చించారు. ఈ విషయంలో టీటీడీపీ నేతల్ని బలి పశువుల్ని చేసేందుకు ముందుగానే నిర్ణయించుకొన్న చంద్రబాబు.. టీన్యూస్ పై విమర్శలు గుప్పించే పనిని అప్పగించారు. స్థానికంగా ఉన్న ఇబ్బందుల్ని ప్రస్తావించినా పట్టించుకోకుండా ఎదురు దాడికి పురమాయించారు. పనిలో పనిగా ఏసీబీ అడుగుతున్న ప్రశ్నల్ని వేం నరేందర్‌నుంచి అడిగి తెలుసుకొన్నట్లు సమాచారం. దీన్నే మరో ఎమ్మెల్యే సండ్ర కు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.

సండ్ర కు ప్రైవేటు కోచింగ్

వాస్తవానికి ఇప్పటికే మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కు ప్రైవేటు కోచింగ్ నడుస్తోంది ఏసీబీ నోటీసు అందుకొన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటరమణ అనారోగ్యం కారణం చూపి విచారణకు హాజరు కాలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన ఏసీబీ కి తెలియపరిచారు. కానీ, ఆయన్ని విజయవాడకు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ పోలీసు ఉన్నతాధికారుల బృందం ఆయనకు కోచింగ్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఇటువంటి కేసుల్ని దర్యాప్తు చేసిన అధికారిని దీనికి ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది..దానికి ఎంత జాగ్రత్తగా జవాబులు చెప్పాలి, ఆ జవాబుల మీద తిరిగి ఎటువంటి ప్రశ్నలు వేస్తారు..వంటి అంశాల్ని ఈ కోచింగ్ లో బోధిస్తున్నట్లు వినికిడి. అంటే నేరాల్ని నియంత్రించేందుకు ద ర్యాప్తు చేయాల్సిన పోలీసు ఉన్నతాధికారులు.... చివరకు నేరం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ప్రైవేటు కోచింగ్ ఇవ్వాల్సి వస్తోంది. వ్యవస్థల్ని చంద్రబాబు ఈ స్థాయికి దిగజార్చారని పోలీసు అధికారులు లోలోపల మథన పడుతున్నారు.

ఫోరెన్సిక్ నిపుణుల సాయం

అకస్మాతుగా చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫోరెన్సిక్ నిపుణుడు గాంధీని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొంది. అకస్మాతుగా ఫోరెన్సిక్ నిపుణుల సేవల్ని తీసుకోవటంమీద సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు వ్యక్తిగతంగా చేసిన కుట్రల్ని ప్రభుత్వ ఖర్చులతో రిపేర్ చేయిస్తున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా కేసుల నుంచి బయట పడేందుకు చంద్రబాబు శత విధాలా ప్రయత్నిస్తున్నారు.

మొబైల్ ఆపరేటర్లకు పోలీసు బెదిరింపులు

నామినేటెడ్ ఎమ్మెలే స్టీఫెన్ సన్ తో పాటు ఏసీబీ అధిపతి ఏకే ఖాన్, నిఘా విభాగం అధిపతి శివధర్ రెడ్డి ల మొబైల్ ఫోన్ కాల్సు డేటా ను సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ పోలీసు ఉన్నతాధికారుల్ని ఈ పనులకు చంద్రబాబు టీమ్ వినియోగిస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి, మొబైల్ ఆపరేటర్ల ను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకొన్న తెలంగాణ ఉన్నతాధికారులు కూడా తమ స్థాయిలో ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తన స్వార్థానికి గాను రెండు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల్ని పరస్పరం శత్రువులుగా చేసినట్లు తెలుస్తోంది.

ఫోన్ లో బిజీ బిజీ

రెండు రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు ..పొడి పొడిగానే అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తూ ఫోన్లలో గడుపుతున్నారు. ఈ కేసును రాష్ట్ర ఉన్నతాధికారులకు జీవన్మరణ సమస్యగా మార్చినట్లు తెలుస్తోంది. దీంతో ఉన్నతాధికారులు మిగిలిన పనుల్ని పక్కన పెట్టేసి ఈ కేసు వివరాలు తెలుసుకోవటం, విశ్లేషణలు సాగించటం ఎజెండాగా పనిచేస్తున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం వ్యవస్థను ఈ కేసు విషయంలో వాడుతున్నట్లు అర్థం అవుతోంది. వ్యక్తిగతంగా చంద్రబాబు చేసిన తప్పుల్ని మాయచేసి, ఆయన్ని రక్షించేందుకు ప్రభుత్వ వ్యవస్థల్ని ఉపయోగిస్తున్నట్లు తేలుతోంది.