పోలవరమే కాదు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌లో హామీ ఇచ్చారుహోదా ఇవ్వకపోతే కృతజ్ఞతలు ఎలా చెబుతారుబాబు తొమ్మిదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టకు రూపాయి కూడా ఖర్చు చేయలేదుజాతీయ హోదా రాకముందే వైయస్‌ఆర్ రూ.5,540 కోట్లు వెచ్చించారుప్లానింగ్ కమిషన్‌కు పంపిన తరువాత కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదుప్రత్యేక హోదా కోసం చేసిన తీర్మానాలు ఏమయ్యాయివైయస్ జగన్ ప్రసంగానికి అడుగడుగనా అధికార నేతల అడ్డంకులుఏపీ అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని కేబినెట్లో, అసెంబ్లీలో చేసిన తీర్మానాలు ఏమయ్యాయని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార టీడీపీని అసెంబ్లీలో కడిగేశారు. స్వప్రయోజనాల కోసం ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదాను కేంద్రానికి చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. గురువారం అసెంబ్లీలో కేంద్రానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో చంద్రబాబు ప్రభుత్వం పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై అనుసరించిన విధానాలను వైయస్ జగన్ తూర్పారబట్టారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా అధికార పార్టీ నేతలు అడుగడుగునా అడ్డుపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రులు దేవినేని ఉమా, కామినేని, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అడ్డుతగిలి వైయస్ జగన్‌పై వ్యక్తిగత దూషణకు దిగారు.
సభలో వైయస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు స్పీచ్ ఇవాళ వింటే పోలవరం ప్రాజెక్టు అన్నది చంద్రబాబు స్వప్నం అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇంతకు ముందు 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. పోలవరానికి ఇప్పటి వరకు రూ. 8800 కోట్లు ఖర్చు చేస్తే.. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకముందే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రూ.5540 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్ హయాంలో 180 కిలో మీటర్ల రైట్ కెనాల్, 135 కిలోమీటర్ల లెప్ట్ కెనాల్ పూర్తి చేశారని తెలిపారు.. చంద్రబాబు సీఎం అయ్యాక, ఈ మూడేళ్ల కాలంలో టీడీపీ ఖర్చు చేసింది కేవలం రూ.3300 కోట్లు అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ కాంట్రాక్ట్ ఉపసంహరించుకుందన్నారు. టీడీపీ మద్దతిచ్చి తెలుగు కాంగ్రెస్ సర్కార్‌ను చంద్రబాబు దగ్గరుండి కాపాడాడని విమర్శించారు. బ్లాక్ లీస్ట్‌లో ఉన్న ట్రాన్స్‌రాయ్ అనే కంపెనీని తీసేయకుండా కొనసాగించార ని ధ్వజమెత్తారు. నామినేషన్ పద్ధతిలో పనులు చేసుకొని దోచుకున్నారని ఆరోపించారు. మంత్రి యనమల బంధువులకు పనులు అప్పగించారని వ్యాఖ్యానించారు. ఆ రోజుకు, ఈ రోజుకు సిమెంట్, ఇసుక, డీజిల్ ధరలు తగ్గినా కూడా అంచనాలు పెంచి కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు.
బాబు గోబెల్స్ ప్రచారం14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందని చంద్రబాబు గోబెల్స్ ప్రచారానికి తెర లేపారని వైయస్ జగన్ మండిపడ్డారు. అబిజిత్‌సింగ్ అనే ఆర్థిక సంఘం సభ్యుడు రాతపూర్వకంగా లేఖ ఇచ్చారు. ఇది చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 31, ఆగస్టు 2015లో, మార్చి 2016లో ఇదే అసెంబ్లీలో రెండుసార్లు చంద్రబాబు తీర్మానాలు చేయించారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని నిలదీశారు. ఇదే చంద్రబాబు హోదా వస్తే ఏముందని అంటున్నారు. మోడీని పక్కన పెట్టుకొని చంద్రబాబు ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని అన్నారు. ఈ విషయం మరిచిపోతే ఎలా? అలాగే కేబినెట్ తీర్మానంలో ప్రత్యేక హోదా ఇవ్వండి అని తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత, నీతి అయోగ్ ఏర్పడకముందు కూడా వీళ్లు పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 2 గురించి బాబు ఏదేదో చెప్పారు. ఆ రోజు హోదా ఇవ్వండి అని కేబినెట్‌లో తీర్మానం చేసిన తరువాత ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించడం లేదన్నారు. ముంపు మండలాలు ఏపీలో కలిపేందుకు చంద్రబాబు చాలా కృషి చేసినట్లు చెబుతున్నారని ఇదింత అసత్య ప్రచారమని వైయస్ జగన్ ఖండించారు.
ఎందుకు నిలదీయడం లేదుఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని వైయస్ జగన్ ప్రశ్నించారు. ఏపీని విడగొట్టేటప్పుడు పోలవరంతో పాటు అన్ని ఇస్తూ ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అవిమాత్రమే ఇస్తున్నామని కేంద్రం సంకేతాలు ఇస్తున్నా చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. ఏపీ పునర్విభజన చట్టంలో పోలవరాన్ని పొందుపరిచారని తెలిపారు. ఇవన్నీ కూడా చేస్తామని కేంద్రం చెప్పిందని చెప్పారు. కేంద్రం పోలవరం బాధ్యత తీసుకుంటామనడం సంతోషించదగ్గ విషయమని, అయితే ప్రత్యేక హోదా ఇవ్వకుంటే చంద్రబాబు కృతజ్ఞతలు ఎలా చెబుతారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. వైయస్ జగన్ తన ప్రసంగం పూర్తి చేయకముందే సభను ఈ నెల 20కి వాయిదా వేశారు.