కేంద్ర,రాష్ట ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పాలి..


వైయస్‌ఆర్‌సీపీ బీసీ విభాగం అధ్యక్షులు  జంగా కృష్ణమూర్తి..

ఢిల్లీః తెలుగు జాతి జీవితాలతో బీజేపీ,కాంగ్రెస్,టీడీపీ ప్రభుత్వాలు ఆటలు ఆడుకుంటున్నాయని వైయస్‌ఆర్‌సీపీ నేత వైయస్‌ఆర్‌సీపీ నేత జంగా కృష్ణమూర్తి అన్నారు. పునర్విభజన చట్టంలో అంశాలు అమలు పర్చకుండా, ప్రత్యేకహోదాను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా ఇస్తేనే ఏపీ పురోగతి చెందుతుందనే నినాదంతో నిరంతరం వైయస్‌ఆర్‌సీపీ పోరాటాలు చేస్తుందన్నారు. ప్రత్యేకహోదా సాధించే వరుకూ వెనక్కితగ్గేందిలేదన్నారు. రాష్ట్రాన్ని నిట్టనిలువునా బీజేపీ,టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ముంచాయని మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు, రాయితీలు వస్తాయని వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు.ప్రత్యేకహోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పదవులను సైతం తృణపాయంగా వదిలి తమ చిత్తశుద్ధి నిరూపించుకున్నారన్నారు.ప్రత్యేకహోదాపై జరిగిన మోసానికి  తెలుగు జాతి మొత్తం గర్జింస్తోందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను బుద్ధి చెప్పడానికి ప్రజలు సమైక్యం కావాలని పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

Back to Top