టీడీపీ పాలనలో అభివృద్ధి పథకాలు నిర్వీర్యం..

విజయనగరంః చంద్రబాబు పాలనలో విజయనగరం అభివృద్ధిలో వెనుకబడిందని వైయస్‌ఆర్‌సీసీ విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. వైయస్‌ఆర్‌ పాలనలోనే విజయనగరం జిల్లా అభివృద్ధి జరిగిందన్నారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధిచేకూరిందన్నారు. జిల్లాలో అక్రమాలు, అవినీతిని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విజయనగరం జిల్లాలో జరిగిన అన్ని బహిరంగ సభలకు  విజయవంతంగా జరిగాయన్నారు. జననేతకు విశేష ప్రజాదరణ లభించిందన్నారు.వైయస్‌ జగన్‌ను చూసి రాజన్న హయాంలో జరిగిన అభివృద్ధిని గిరిజనులు గుర్తు చేసుకున్నారని, మళ్లీ ఆయన తనయుడు వస్తే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలు ఆశతో ఉన్నారన్నారు.టీడీపీ పాలనలో జిల్లా వివక్షతకు గురైందన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో జిల్లాకు మేలు జరుగుతుందని ప్రజలు సంపూర్ణ నమ్మకంతో ఉన్నారన్నారు.
Back to Top