కార్యకర్తలకు అండగా ఉంటాం

సదుం: పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు తమ కుటుంబం అండగా ఉంటుందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మండంలోని 79ఏ చింతమాకులపల్లె మాజీ సర్పంచ్, వైయస్సార్‌సీపీ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు శాంతమ్మ భర్త పురుషోత్తంరెడ్డి (65)అనారోగ్యంతో శనివారం మృతిచెందారు. సోమవారం బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి, పాలుపోసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన వెంకటరమణ అనే అంధుడు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయిన తనకు పింఛన్‌మంజూరు కాలేదని వాపోయాడు. స్పందించిన ఎమ్మెల్యే వెయ్యి రూపాయలు ఆయనకు అందించారు. ప్రభుత్వం పింఛన్‌మంజూరు చేసే వరకు ప్రతినెలా తానే వెయ్యి రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, సర్పంచ్‌ మల్లికార్జుననాయుడు, ఎంపీటీసీ విజయభాస్కర్, ప్రకాశంరెడ్డి, గురుకిరణ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

Back to Top