వైయస్‌ జగన్‌ను సీఎం చేసే వరకు నిద్రపోకూడదు

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసే వరకు మనం నిద్రపోకూడదని వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం కాకినాడ నగరంలోని సంత చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సింహాన్ని చూడాలంటే అడవిలో చూడాలని, వైయస్‌ జగన్‌ను చూడాలంటే జనంలోనే చూడాలన్నారు. కాకినాడలో జన వరద పొంగుతుందన్నారు. మనకోసం కష్టపడుతున్న మన నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో చూడాలని, అందుకోసం ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేద్దామన్నారు. టక్కుటమార విద్యలు ప్రదర్శించే చంద్రబాబుతో మనం పోరాటం చేస్తున్నామన్నారు. మన నాయకుడు ప్రజా సంకల్ప యాత్ర చేస్తుంటే..చంద్రబాబు దోమలపై దండ యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాకినాడను స్మార్ట్‌ సిటీ అని ప్రకటించి పెద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని విరమ్శించారు. ఇటీవలే కుక్కలు కరిచి బాలుడు మృతి చెందాడని గుర్తు చేశారు. కబుర్లు చూస్తే కోటలు దాటుతున్నాయని, చేతల్లో ఈ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. మన నాయకుడు వస్తేనే రాష్ట్రంలో దుష్ట పరిపాలనకు చరమ గీతం పాడుతుందన్నారు. ఈ జిల్లాకు చంద్రబాబు ఏమీ చేయలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేసింది వైయస్ జగన్‌ మాత్రమే అన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే ప్రత్యేక హోదా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Back to Top