చింతపల్లిః బాక్సైట్ తవ్వకాలపై చంద్రబాబు చేస్తున్న కుటిల నీతిని ప్రతపక్ష నాయకుడు వైఎస్ జగన్ చింతపల్లి వేదికగా ఎండగట్టారు. గిరిజనుల జీవితాలతో ఆడుకోవద్దని, చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే జీవో రద్దు చేయాలని జననేత డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే....
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తానే పోరాడుతున్నట్లు చెప్పాడు. అసెంబ్లీలో కూడా మాట్లాడాడు.రాజశేఖరరెడ్డి గారు చనిపోయాక.. ఇప్పుడు మళ్లీ ఆయన గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు.
ఇష్టారాజ్యంగా మైనింగ్ చేపడితే గిరిజనులు ఇబ్బంది పడతారని, ప్రభుత్వంతో చేయించాలని.. స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకేశారు.
తప్పు ఎవరు చేసినా తప్పే అని చెప్పాలి. ప్రజల మనోభావాలకు అనుకూలంగా నడుచుకోవాలి. ఆరోజు కాస్త ముందుకు వెళ్లినా, తర్వాత దాన్ని ఆపించేశారు.
తానేం చెప్పినా పార్టీ ఒప్పుకొంటుందని తెలిసినా, గిరిజనులు వ్యతిరేకిస్తున్నారని అర్థమైన తర్వాత నుంచి ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అందుకే ఆయన హయాంలో జరగలేదు..
ఆయన మరణించిన ఆరేళ్ల తర్వాత, చంద్రబాబు సీఎం అయ్యాక ఇప్పుడు జరుగుతోంది.
2011 సంవత్సరంలో ఇదే గిరిజన ప్రాంతానికి జేసీ కాలా నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిషన్ వేసిన మాట వాస్తవమా కాదా అని చంద్రబాబును అడుగుతున్నాను.
వాళ్లిచ్చిన నివేదికను కేంద్రం కూడా పక్కన పెట్టేస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక ఒకటి కాదు, రెండు కాదు.. 10.2.2015న ఒకటి, 23.2.2015, 21.7.2015, 5.8.2015న ఇంకోటి లేఖలు కేంద్రానికి రాసి, ఒత్తిడి తెస్తే కేంద్రం అనుమతి ఇచ్చింది.
ఇదే చంద్రబాబు కాలా కమిషన్ వచ్చినప్పుడు గవర్నర్‌కు లేఖ రాశాడు. గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి తవ్వకాలకు తానూ వ్యతిరేకం అన్నారు.సీఎం అయిన తర్వాత బాక్సైట్ గనులకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని ప్లేటు ఫిరాయించాడు.ఒక శ్వేతపత్రం విడుదల చేశాడు. అందులో రకరకాల మాటలు మాట్లాడాడు. అన్నీ అబద్ధాల పుట్ట.జేరాల గ్రామ పంచాయతీ ఆరోజే తీర్మానం చేసిందని అంటాడు.అప్పుడు గవర్నర్‌కు చెప్పేది ఈయనే, ఇప్పుడు ఈ మాట అనేదీ ఈయనే.తనకు అనుకూలంగా ఉంటే ఒకమాట, లేకపోతే మరోమాట చెబుతాడు.ఈ గ్రామానికే అప్పట్లో వెంకటరమణ సర్పంచి. ఆయనే గ్రామసభ జరగలేదని స్వయంగా చెబుతున్నాడు. అయినా చంద్రబాబు మాత్రం సభ జరిగిందని శ్వేతపత్రంలో రాస్తున్నాడు.ఇదే చంద్రబాబు జీవో 97 అని కేంద్రం నుంచి క్లియరెన్సు వచ్చాక విడుదల చేశాడు.గిరిజన ప్రాంతంలో అలజడి మొదలయ్యేసరికి ఈ జీవో ఎలా వచ్చిందో తనకు తెలియదని, దాన్ని అబెయెన్స్‌లో పెట్టానని అంటాడుప్రభుత్వం జీవో ఇస్తే చేస్తుంది, ఉపసంహరించుకుంటే చేయదు. మధ్యలో పెండింగులో పెట్టడం ఏ ముఖ్యమంత్రి దగ్గరా వినలేదుఈరోజు కూడా చంద్రబాబు కనీసం ఒకటి చేసినా... చేశానని చెప్పుకొనే దమ్ము, ధైర్యం లేవు.చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే జీవోను ఎందుకు ఉపసంహరించుకోవట్లేదని గట్టిగా అడుగుతున్నా.15.8.2015న కేంద్రం రెండోస్థాయి పర్యావరణ అనుమతి ఇస్తూ.. గ్రామసభలు మళ్లీ జరగాలని ఒక క్లాజు పెట్టింది. గిరిజన సలహా మండలి సిఫార్సు కూడా ఉండాలని మరో క్లాజు పెట్టింది.అయినా గిరిజన సలహా మండలిని ఎందుకు వేయడం లేదని చంద్రబాబును అడుగుతున్నాచంద్రబాబు జీవితం అంతా మోసం.. మోసం.. మోసం.. అన్న మూడు పదాల చుట్టే తిరుగుతుంది.ఎన్నికలకు ముందు టీవీలు ఆన్ చేస్తే.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇళ్లకు రావాలంటే బాబు సీఎం కావాలని అన్నారా లేదా, జాబు రావాలంటే బాబు సీఎం కావాలని అన్నారా.. లేదా, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారా లేదా?ప్రతి విషయంలో మోసం, దగా, అబద్ధాలు. ఈరోజు చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పాలి.చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెబుతున్నాం.బాక్సైట్ తవ్వకాలకు ఆయన అనుమతి ఇచ్చినా ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదునువ్వు నిజంగా మంచోడివైతే, మాటమీద నిలబడే తత్వం ఉంటే వెంటనే జీవోను రద్దు చేసి, మాట నిలబెట్టుకోండి.కనీసం ఈ మాటైనా నిలబెట్టుకోవాలని గట్టిగా అడుగుతున్నాం.అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం, అండగా ఉంటాం.చంద్రబాబు మన వెంట్రుక కూడా పీకలేడని చెబుతున్నాంమీకు అన్నిరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.అన్ని రకాలుగా మనం గట్టిగా పోరాడుదాం.
ఇక్కడున్న యువకులు డీఎస్సీ పరీక్షలు రాసి సంవత్సరం అయిపోయింది. పిల్లలు పెద్ద పెద్ద నగరాలకు వెళ్లి ప్రభుత్వోద్యోగాలు కదా అని చెప్పి, ఇంట్లో నుంచి తల్లిదండ్రులు పుస్తెలమ్మి డబ్బులు పంపితే హాస్టళ్లలో ఉండి చదువుకుని డీఎస్సీ రాస్తే.. వాళ్లకు ఉద్యోగాల మాట దేవుడెరుగు, క్లస్టర్ స్కూళ్లని కొత్త విధానం తెస్తున్నాడు. దాంతో ఉన్న స్కూళ్లు కూడా మూసేసి.. 7వేల మంది టీచర్ల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాడు. కనీసం ఇప్పటికైనా బుద్ధి రావాలి, బుద్ధి వచ్చేవరకు పోరాడుదాం. గిరిజనులకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది.