కాంట్రాక్టు అధ్యాపకుల డిమాండ్లు అసెంబ్లీలో వినిపిస్తా

అనంతపురం:   కాంట్రాక్టు అధ్యాపకుల డిమాండ్లను అసెంబ్లీలో వినిపించి పరిష్కారం కోసం కృషి చేస్తానని వైయస్‌ఆర్‌సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు అధ్యాకులు చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంట్రాక్టు అధ్యాపకులు వ్యవస్థను తీసుకువచ్చిందే నేను... అధికారం చేపట్టగానే క్రమబద్దీకరిస్తానని ఎన్నికల ముందు తప్పుడు హామీలు గుప్పించి అధికారం చేపట్టిన బాబు.. ఆదిశగా చర్యలు చేపట్టక పోగా కాంట్రాక్టు ఉద్యోగులనే కాకుండా విద్యార్థులను, రైతులను.. ఇలా యావత్తు రాష్ట్ర ప్రజలను రోడ్డున పడేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తానని ఇప్పటికే పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చాడని గుర్తు చేశారు. డిమాండ్ల సాధన కోసం 10 రోజులుగా కాంట్రాక్టు అధ్యాపకులు సమ్మె చేపడుతుంటే ప్రభుత్వం  పట్టించుకున్న పాపన పోలేదన్నారు. ప్రజాసమస్యలు... ప్రజా ఉద్యమాలపై స్పందించే గుణం ప్రభుత్వానికి లేదన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని నిరకుశత్వంగా అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజా ఉద్యమాలను అణచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని చంద్రబాబు ప్రభుత్వం సంపూర్ణంగా నెరవేర్చిన పాపన పోలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బాబు పాలనకు చమరగీతం పాడాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, అనీల్‌కుమార్‌ గౌడ్‌తోపాటు కాంట్రాక్టు అధ్యాపకులు హనుమంతరెడ్డి, సుబ్రమణ్యం, అక్బర్, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top