విశాఖలో వైఎస్సార్సీపీ బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ పిలుపు మేరకు ప్రజలు, పార్టీశ్రేణులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అనే నినాదంతో పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఈసందర్భంగా జగదాంబ సెంటర్ లో ధర్నాకు దిగిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు హనుమంతరెడ్డి సహా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.