ఫిరాయింపులపై ప్రైవేట్‌ మెంబర్ బిల్లు

ఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో శుక్రవారం ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 21 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలోకి ఫిరాయించారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునేందుకు నిర్ణీత కాల వ్యవధి పెట్టకపోవడంతో అధికార పార్టీలు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. పార్టీ ఫిరాయింపుదారులపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం లేదు. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను సవరించాలని విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరనున్నారు.. ఫిరాయింపుదారులపై 90 రోజుల్లో అనర్హత వేటు వేయాలి. స్పీకర్‌ నిర్ణయం తీసుకోకుంటే ఆ అధికారాన్ని ఈసీకి ఇవ్వాలని ఆయన కోరనున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చర్చ చేపట్టాలని ఎంపీ విజయసాయిరెడ్డి సభను కోరనున్నారు.

Back to Top