విజయమ్మ ప్రతిపాదన హర్షణీయం: వడ్డెర సంఘం

హైదరాబాద్, ఆగస్టు 23: బీసీలకు శాసనసభలో 100 స్థానాలు కేటాయించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు రాష్ట్ర వడ్డెర సంఘం ప్రకటించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యవర్గం సమావేశమై నిర్ణయించినట్లు అధ్యక్షుడు టి.ధర్మరాజు గురువారం తెలిపారు. వడ్డెర కులాన్ని గుర్తించి, ప్రోత్సహించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. వడ్డెర కులాన్ని షెడ్యూల్ జాబితాలో చేర్చాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించి వైయస్­ కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు. తమ కార్యవర్గ సమావేశానికి నేతలు ఓర్సు కృష్ణయ్య, జె.రెడ్డప్ప, వి.రాముడు, వై.మాధవి, జి.రమణమ్మ తదితరులు హాజరైనట్లు తెలిపారు.

Back to Top