ఖమ్మం జిల్లాలో నేడు విజయమ్మ పర్యటన

ఖమ్మం 27 జూన్ 2013:

స్థానిక సంస్ధల ఎన్నిలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. ఖమ్మం శివార్లలోని బోనకల్ రోడ్‌- శ్రీలక్ష్మి గార్డెన్సు లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశమవుతారు. తొలుత, బుధవారం నల్లగొండ జిల్లా కోదాడలో పార్టీ కార్యకర్తల సమావేశం ముగించుకుని శ్రీమతి విజయమ్మ సాయాంత్రానికి నేరుగా ఖమ్మం చేరుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో సమీక్షిస్తారని పార్టీ నేతలు తెలిపారు.

సాంఘిక సంక్షేమ హాస్టల్లో విజయమ్మ తనిఖీ

ఎన్ఎస్సీ క్యాంప్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని శ్రీమతి విజయమ్మ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెకు వసతి గృహంలోని సౌకర్యాలలేమీని విద్యార్థులు విన్నవించారు. హాస్టల్లో నెలకొన్న సౌకర్యాలలేమీపై ఆమె వార్డెన్ను ప్రశ్నించారు. అనంతరం విద్యార్థినులకు నోట్‌ పుస్తకాలను అందచేశారు.

Back to Top