గుంటూరు: జన్మభూమి కమిటీల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానిక సంస్థల హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని సూచించారు. మతం పేరుతో జనాన్ని విడగొట్టే చర్యలను ఖండించాలని ఆయన అన్నారు.