విద్యుత్‌పై వైయస్‌ఆర్‌సిపి పోస్టుకార్డుల ఉద్యమం

నెల్లూరు : విద్యుత్‌ చార్జీల పెంపుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోస్టు కార్డుల ఉద్యమం నిర్వహించింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వేదాయపాళెంలో బుధవారం‌ పార్టీ నాయకులు పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్వహించి విద్యుత్ చార్జీల దోపిడీని అడ్డుకుంటామని ‌పార్టీ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు.

విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు ఈ రోజు పాదయాత్ర పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు తిరుగుతున్నా‌రని కోటంరెడ్డి విమర్శించారు.‌ చంద్రబాబు పాలనా కాలం నాటి కరెంట్ కష్టాలు మళ్లీ ఇప్పుడు కిరణ్ ‌హయాంలో మొదలయ్యాయని ఆయన ఆరోపించారు. కరెంట్ కష్టాలు లేని రాజ్యాన్ని‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి అందిస్తారన్నారు.
Back to Top