విద్యార్థులందరి గుండెల్లోనూ వైయస్ జ్ఞాపకాలే

ఇడుపులపాయ, 2 సెప్టెంబర్‌ 2012 : దివంగత జననేత వైయస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా‌ మన మధ్య లేకపోయినా తమ హృదయాల్లో ఆయన ఎప్పటికీ నిలిచే ఉంటారని ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ‌అన్నారు. వైయస్‌ఆర్ మూడవ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఇడుపులపాయకు భారీ ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. వైయస్‌ఆర్ ఘా‌ట్‌లో వారు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రతీ పేద విద్యార్థీ ఉన్నత చదువులు చదువుకోవాలని తపించిన వైయస్‌ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయుడని నివాళులు అర్పించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి వల్లే వైయస్‌ఆర్ ఆశయాలు ‌నెరవేరుతాయని విద్యార్థులు పేర్కొన్నారు.

Back to Top