వెలగపూడిలో ఉద్రిక్తత

అమరావతి: వెలగపూడిలో దీక్ష చేస్తున్న అసైన్డ్‌ భూముల రైతులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల పార్లమెంటరీ ఇన్‌చార్జి నందిగాం సురేష్‌ సంఘీభావం తెలిపారు. ర్యాలీగా బయల్దేరిన సురేష్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్న సురేష్‌తో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 
Back to Top