<strong>హైదరాబాద్, 16 మార్చి 2013:</strong> వస్త్రాలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ విధించడం అన్యాయమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు. ఒక పక్కన పక్క రాష్ట్రాలు వస్త్ర వ్యాపారానికి రాయితీలు ఇస్తుంటే మన ప్రభుత్వం మాత్రం వ్యాట్ వసూలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం దిగి రాకపోతే మెడలు వంచుతామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు.<br/>వస్త్రాలపై విధిస్తున్న వ్యాట్‌ను ఎత్తివేయాలంటూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు దగ్గర వస్త్ర వ్యాపారులు నిర్వహిస్తున్న ధర్నాకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, వస్త్ర వ్యాపారుల సమస్యలపై సోమవారం సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వ్యాట్‌ను ఎత్తివేసే వరకూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని మరో ఎమ్మెల్యే శ్రీనివాసులు స్పష్టం చేశారు.