ఢీల్లీలో వంచన పై గర్జన

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాల నిర్లక్షం, నిర్లిప్తతలను నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ ఢిల్లీలో గళం
వినిపించనుంది. గురువారం ఉదయం జంతర్ మంతర్ వద్ద వంచన పై గర్జన దీక్షను
నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన ఎంపిలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  ఇతర సీనియర్
నాయకులు ఈ దీక్షలోపాల్గొననున్నారు. వీరంతా ఇప్పటికే సభా స్థలికి చేరుకున్నారు.
సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. ప్రత్యేక హోదా గత నాలుగున్నరేళ్లుగా పోరాటం చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు శీతాకాల చివరి సమావేశాల్లో సైతం గళం విప్పడానికి నిరసన చేపట్టింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వంచన పై గర్జనలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

తాజా వీడియోలు

Back to Top