వ‌నజాక్షి చేసింది మంచే క‌దా..!

రాష్ట్ర ప్ర‌భుత్వానికి క‌ను విప్పు క‌లుగుతుందా..!

హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చెల‌రేగుతున్న ఇసుక మాఫియా మీద హైకోర్టు సీరియ‌స్ అయింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్న ఇసుక త‌వ్వ‌కాల మీద ఆ జిల్లా క‌లెక్ట‌ర్ ను ఉన్న‌త న్యాయ‌స్థానం నిల‌దీసింది. ఈ అక్ర‌మ త‌వ్వ‌కాల మీద దాఖ‌లైన పిటీష‌న్ ను న్యాయ‌స్థానం విచారించింది.

వాస్త‌వానికి ఇసుక అక్ర‌మ త‌వ్వ‌కాలు కొన్ని రోజుల క్రితం రాష్ట్ర స్థాయిలో చ‌ర్చ‌కు దారి తీశాయి. అప్ప‌ట్లో మ‌హిళా త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షి ఇసుక అక్ర‌మ తవ్వ‌కాల్ని అడ్డుకొనేందుకు ప్ర‌య‌త్నించారు. అప్పుడు చంద్ర‌బాబు ప్రియ శిష్యుడు, తెలుగుదేశం ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఆమె మీద దాడి చేయించారు. జుట్టు ప‌ట్టి ఈడ్పిండి అనుచ‌రుల‌తో కొట్టించారు. ఇది అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం క‌లిగించింది. ప‌ట్ట ప‌గ‌లు నిస్సిగ్గుగా దాడి చేయించిన చింత‌మ‌నేని ని ముఖ్య‌మంత్రి వెన‌కేసుకొని రావ‌ట‌మే కాకుండా మ‌హిళా త‌హ‌శీల్దార్ దే త‌ప్పు అని తేల్చారు. దీని మీద మంత్రి మండ‌లి చేత ఆమోద ముద్ర వేయించారు. 
అప్ప‌టి నుంచి ఇసుక అక్ర‌మ త‌వ్వ‌కాల‌కు అడ్డు అదుపు  లేకుండా పోయింది. తెలుగు త‌మ్ముళ్లు దొరికినంత మేర దోచేసుకొంటున్నారు. ఈ నేప‌థ్యంలో హైకోర్టు చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యాన్ని  సంత‌రించుకొన్నాయి. ఏ నిబంద‌న‌ల ప్ర‌కారం ఇసుక క్వారీల‌కు అనుమ‌తి ఇచ్చార‌ని హైకోర్టు ప్ర‌శ్నించింది. ఇబ్బ‌డి ముబ్బడిగా త‌వ్వ‌కాలు చేప‌డితే ఎలా..! భ‌విష్య‌త్ త‌రాల‌కు ఇసుక అవ‌స‌రం ఉండ‌దా...! అని ప్ర‌శ్నించింది. ఇసుక స‌హా స‌హ‌జ వ‌న‌రుల్ని సంర‌క్షించాల్సిన బాధ్య‌త రెవిన్యూ యంత్రాంగానిదే అని గుర్తు చేసింది. స‌
మ‌రి ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వానికి క‌ను విప్పు క‌లుగుతుందా..! లేక బాధ్య‌త‌తో ప‌నిచేసే ఉద్యోగుల‌దే త‌ప్పు అని తీర్మానాలు చేస్తుందా..!
Back to Top