కడప, 10 అక్టోబర్ 2012: మాజీ మంత్రి, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ వివేకానందరెడ్డి రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఆయన కారు డ్రైవర్ లక్ష్మీనారాయణకు తీవ్రంగా గాయాలయ్యాయి. వైయస్‌ఆర్ జిల్లా వేంపల్లి మండలం వేంపల్లి బైపాస్‌లోని అలవలపాడు క్రాస్ వద్ద బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు - వివేకానందరెడ్డి వాహనం ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది.<br/>వేంపల్లిలో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత వివేకానందరెడ్డిని, డ్రైవర్ లక్ష్మీనారాయణను కడప ఆసుపత్రికి తరలించారు. మూలమలుపు వద్ద ఎలాంటి ప్రమాద సూచికలు లేకపోవటం ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. వైయస్ వివేకానందరెడ్డి పులివెందుల నుంచి కడపకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.