'వైయస్‌ కుటుంబాన్ని కించపరిస్తే తస్మాత్'

హైదరాబాద్‌, 26 నవంబర్‌ 2012: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఢిల్లీలో నిలువునా అమ్మేశారని మాజీ ఎమ్మెల్సీ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు‌ హెచ్.ఎ. రెహ్మాన్ దుయ్యబట్టారు. ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరెడ్డి కుటుంబంపై అవాకులు, చవాకులు పేలితే నాలుక కోస్తామని ఆయన సోమవారం ఇక్కడ హెచ్చరించారు. మంత్రులను కాపాడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వై‌యస్ జగ‌న్పై ఎందుకు కక్షకట్టిందో చెప్పాలని రెహ్మా‌న్ డిమాండ్ చేశారు.‌ ల్యాంకో సంస్థల అధినేత లగడపాటి రాజగోపాల్కు,‌ కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్కు మధ్య ఉన్న వ్యాపార సంబంధాలను ప్రజలకు తెలపాల‌ని ఆయన డిమాండ్‌ చేశారు.
Back to Top