వైయస్‌ఆర్‌సిపిలో చేరిన హూబర్టు ఫ్రాన్సిస్

హైదరాబాద్, 16 మార్చి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లికి చెందిన యువజన కాంగ్రెస్‌ నాయకుడు హూడర్టు ఫ్రాన్సిస్‌ ఎగ్జీవియో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మారేడ్‌పల్లికే చెందిన కాంగ్రెస్‌ నాయకులు ప్రేమ్‌, సుమన్‌, రాణా ప్రతాప్‌రెడ్డి, ప్రవీణ్‌ నాయక్, శ్రీకాంత్‌ మున్షీతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు కూడా శనివారం ఉదయం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

లోటస్‌పాండ్‌లోని పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నివాసంలో పార్టీ సీనియర్‌ నాయకుడు వై.వి. సుబ్బారెడ్డి సమక్షంలో పార్టీలో చేశారు. వారందరికీ పార్టీ కండువాలు వేసి సుబ్బారెడ్డి ఆహ్వానించారు. కొత్తగా చేరిన వారంతా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సుబ్బారెడ్డి ఈ సందర్భంగా సూచించారు. 
Back to Top