వైయస్ఆర్ సీపీలోకి టీడీపీ, పీఆర్పీ నేతలు

చిత్తూరు: టీడీపీ, పీఆర్పీ నేతలు ఆదివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఏఎస్.మనోహర్ సమక్షంలో టీడీపీ ప్రేమ్‌నాథ్, పీఆర్పీ పీ.రామమూర్తి పార్టీలో చేరారు. రీడ్సుపేటకు చెందిన ప్రేమ్‌నాథ్ రిటైర్డు ప్రధానోపాధ్యాయులు. ఆయన టీడీపీలో ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఎస్‌ఎస్‌టీఎఫ్ ఉపాధ్యాయ సంఘానికి జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించారు. మహానేత వైయస్.రాజశేఖర్‌రెడ్డి నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, ఇందిరాగాంధీ జాతీయ ప్రియదర్శిని అవార్డు సైతం అందుకున్నారు.

చిత్తూరు గిరింపేటకు చెందిన పీ.రామమూర్తి గతంలో ప్రజారాజ్యం పార్టీలో వార్డు కన్వీనర్‌గా పనిచేశారు. వైయస్.జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన్ను చిత్తూరు నగర 19వ వార్డు కన్వీనర్‌గా నియమిస్తూ ఏఎస్.మనోహర్ ఆదేశాలు జారీ చేశారు. వారితో పాటు రీడ్సుటకు చెందిన రిటైర్‌‌డ బ్యాంకు ఉద్యోగి ఎస్.చంద్రశేఖర్ సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా కన్వీనర్ నారాయణస్వామి మాట్లాడుతూ చిత్తూరులో ఏఎస్.మనోహర్, పార్టీ నగర కన్వీనర్ రఘునాథరెడ్డి ఆధ్వర్యం లో వార్డు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి..

ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వైయస్ఆర్‌ టీఎఫ్ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఏఎస్.మనోహర్‌ను కోరారు. విద్యావలంటీర్లుగా పనిచేస్తూ క్రమబద్దీకరణ అయిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు వచ్చేలా చూడాలన్నారు. మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డు లు ఇవ్వాలని కోరారు. వైయస్ఆర్‌ టీఎఫ్ జిల్లా కన్వీనర్ సీ.బాబు, కో-కన్వీనర్లు దామోదరన్, గోవిందన్, దొరై, రవీంద్రబాబు, మురుగయ్య, కార్యవర్గ సభ్యులు స్వామినాథన్, వేలాయుధం, ఆర్ముగం, కృష్ణ, నాగరాజ్, భాస్కరరావు, ఆనందన్, వెంకటరత్నం పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

తాళ్లరేవు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆదివారం ప్రజలు పెద్ద సంఖ్యలో చేరారు.  తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామానికి చెందిన వందలాది మంది గ్రామ కమిటీ కన్వీనర్ మాసా శ్రీనువాస్(కేబుల్ శ్రీను) ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుత్తుల సాయి కండువాలు వేసి కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో గడపగడపకూ వైయస్ఆర్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ పెద్దాపురం నియోజక వర్గ ఇన్‌చార్జి తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో సామర్లకోట పట్టణానికి చెందిన 200 మంది బ్రౌన్‌పేట సెంటర్లో పార్టీలో చేరారు. ముందుగా సెంటర్లోని అంబేద్కర్, వైయస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. 

Back to Top