వైయస్ఆర్ సీపీలో 720మంది చేరిక

చల్లపల్లి: జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు సమక్షంలో నడకుదురు, పురిటిగడ్డ, రాముడుపాలెం గ్రామాల్లో 550 మందికి పైగా వైయస్ఆర్ సీపీలో చేరారు. జోరున వాన కురుస్తున్నా... లెక్క చేయక పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. నడకుదురు, పాత నడకుదురు గ్రామాల్లో గొరిపర్తి సురేష్, గొరిపర్తి రమేష్, చిరంజీవి, డి.వి.ఆర్.కుమార్, గోళ్ల ప్రభాకరరావు ఆధ్వర్యంలో 250 మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. రాములుపాలెంలో దాసరి హరిబాబు ఆధ్వర్యంలో పార్టీ జెండా దిమ్మను ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో 300 మంది పురుషులతోపాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. వీరికి పార్టీ కండువాలు కప్పి కేయన్నార్ పార్టీలోకి ఆహ్వానించారు. రాముడుపాలెంలో వర్షం పడుతున్నా లెక్కచేయక గొడుగులు వేసుకుని మరీ పార్టీలో చేరేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా కేయన్నార్ మాట్లాడుతూ దివంగత మహానేత రాజశేఖరరెడ్డిని ఎంతగా అభిమానిస్తున్నారో.. యువనేత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చూడాలని ఎంతగా తపన పడుతున్నారో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

ప్రజా సమస్యలపై పోరాడే ఏకైక నేత జగన్
ఉత్తరపాలెం(మోపిదేవి) : ప్రజాసమస్యలపై పోరాడే సత్తా ఉన్న ఏకైక నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నేత కుక్కల నాగేశ్వరావు అన్నారు. మండల పరిధిలోని ఉత్తరపాలెంలో ఆపార్టీ మండల కన్వీనర్ అరజా నరేంద్రకుమార్, దాసరి హరిబాబు ఆధ్వర్యంలో కేఎన్‌ఆర్ సమక్షంలో ఆదివారం 170మంది వైఎస్సార్ సీపీలోచేరారు. ప్రతికార్యకర్తకు అండగా ఉండి పార్టీ రథచక్రాలను ముందుకు నడిపించే సమర్థతగల నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దివంగత నేత వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాల ఆశయసాధన కోసం జననేత సీఎం కావాలన్నారు.

పార్టీ విధివిధానాలను వివరించారు. తొలుత దివంగత వైఎస్ చిత్రపటానికి, అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సింహాద్రి రమేష్, గుడివాక శివరావ్, యాసం చిట్టిబాబు, గాజుల మురళీకృష్ణ, కోసూరు గోపీచంద్, మండల యూత్ కన్వీనర్ తేళ్లబాబు, చల్లపల్లి మండల కన్వీనర్ చండ్ర వెంకటేశ్వరావు, నాయకులు పఠాన్ కరీముల్లాఖాన్, సింహాద్రి వెంకటేశ్వరావు పాల్గొన్నారు. 

Back to Top