వైయస్ఆర్‌ కాంగ్రెస్‌తోనే మైనార్టీల సంక్షేమం

పెనుకొండ:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు న్యాయం ఒనగూరుతుందని ఆ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రెహ్మాన్ పేర్కొన్నారు. పార్టీ మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ నూర్‌బాబా నేతృత్వంలో ఆదివారం పెనుకొండ పట్టణంలోని దర్గాపేటలో మైనార్టీల సదస్సు ఏర్పాటైంది. పార్టీ నాయకుడు జీవీపీ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో ముస్లింలకు స్వర్ణయుగం వస్తుందన్నారు. ఆయన కోసం ముస్లిం సోదరులందరూ కలసిరావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ‘వస్తున్నా... మీకోసం’ పేరుతో ప్రజలను మళ్లీ మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తన సలహా వల్లే దివంగత మహానేత డాక్టర్ వైయస్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెబుతున్న గులాంనబీ అజాద్... రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన జమ్మూ కాశ్మీర్‌లో ఇలాంటి పథకాలు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.  అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ శంకరనారాయణ, సీఈసీ సభ్యుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ

Back to Top