వైయస్ఆర్‌ కాంగ్రెస్‌లోకి వెల్లువలా చేరికలు

గుంతకల్లు:

అనంతపురం జిల్లాలో వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దోనిముక్కలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాదాపు 150 మంది ఆదివారం రాత్రి నియోజకవర్గ ఇన్‌చార్జి వై. వెంకటరామిరెడ్డి నివాసంలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో వైయస్ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచు తలారి రోగెప్ప, మాజీ ఉప సర్పంచు పశువుల భీమన్న, వాటర్‌షెడ్ మాజీ అధ్యక్షుడు దొనికొండ లాలెన్న, మాజీ వార్డు మెంబరు హనుమన్న మాదిగ, నాయకులు శేకన్న, కరిబసవగౌడ్, నారాయణస్వామి, రజాపురం మల్లికార్జున, రజాపురం చంద్రప్ప, సుదర్శన్, కుంటి భాస్కర్, దొనికొండ నాగప్ప, ధోనిముక్కల గోపాల్, కదిరప్ప, మల్లేశు, నాగప్ప తదితరులు ఉన్నారు. కసాపురానికి చెందిన వికలాంగుల సంఘం నాయకులు డేనియల్, మన్మథ, క్రిష్ణకుమార్, జానకిరాముడు, మధు, శ్రీనివాసులు, ఆంజనేయులు, శంకరయ్య, కె.రాజమ్మ, నారాయణమ్మ తదితరుల ఆధ్వర్యంలో దాదాపు 30 మంది వికలాంగులు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరిని వై వెంకటరామిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
వజ్రకరూరు : గంజికుంటకు చెందిన కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శివానంద ఆదివారం షర్మిల సమక్షంలో వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన్ను షర్మిలతోపాటు సీఈసీ సభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం షర్మిల వెంట శివానంద పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు లాయర్ ఉమాపతి, మండల కన్వీనర్ మణ్యం ప్రకాష్, నాయకులు పాల్గొన్నారు.

Back to Top