వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన కుమరన్

హైదరాబాద్:

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్ యునెటైడ్ ఎంప్లాయిస్ విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ కార్మిక నాయకుడు ఎన్.ఎస్. కుమరన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పదవీ విరమణ చేసిన అనంతరం కంపెనీ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ బి. జనార్దన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. కుమరన్‌తో పాటు పదవీ విరమణ చేసిన ఎం. బాలరాజ్‌ను సైతం పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా ఈసీఐఎల్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ.యస్.రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల ఇంఛార్జులు సింగిరెడ్డి ధన్‌పాల్ రెడ్డి, జి.సూర్యనారాయణ రెడ్డి, రంగారెడ్డి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎంపాల పద్మారెడ్డి, సేవాదళ్ జిల్లా చైర్మన్ దర్గ సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Back to Top