'వైయస్‌ఆర్‌ హయాంలో రాష్ట్రం సుభిక్షం'

సొలస (గుంటూరు జిల్లా), 12 మార్చి 2013: ఒక తండ్రిలా ఆలోచించడం వల్లే మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మన రాష్ట్రం సుభిక్షంగా ఉందని శ్రీమతి షర్మిలన్నారు. మహానేత బ్రతికి ఉండి ఉంటే ఇప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్ ‌సరఫరా చేసేవారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడినందుకే జగనన్నపై కాంగ్రెస్ కక్షగట్టిందని ‌ఆమె ఆరోపించారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు, ఎం‌.పి. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే బయటకు వస్తారని ‌శ్రీమతి షర్మిల చెప్పారు. అప్పుడు అందరి కష్టాలూ తీరిపోతాయన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారంనాడు శ్రీమతి షర్మిల గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని సొలసలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రచ్చబండ కార్యక్రమంలో ఆమె స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

వర్షానికి మిర్చి, పత్తి పంట తడిసిపోయినా తమను ఆదుకునే దిక్కు లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని శ్రీమతి షర్మిల విచారం వెలిబుచ్చారు. తల్లిదండ్రులు తమ చదువులకు ఫీజులు చెల్లించలేక పెళ్లిళ్లు చేస్తున్నారని కొందరు విద్యార్థినులు శ్రీమతి షర్మిల ముందు వాపోయారు. జగనన్న సిఎం అయ్యాక అన్ని కష్టాలు తీరతాయని వారికి శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో వైయస్‌ఆర్‌సిపి రెండేళ్లు పూర్తి చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో 200లకు పైగా ఎమ్మెల్యే సీట్లు, 35 ఎం.పి. స్థానాలను పార్టీ గెలుస్తుందని శ్రీమతి షర్మిల ధీమా వ్యక్తం చేశారు.
Back to Top