బెల్లంపల్లి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క న్వీనర్ బోడ జనార్దన్ అభిప్రాయపడ్డారు. మండల కేంద్రంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. వైయస్ హయాంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారని, వాటిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చుతోందన్నారు. ఫీజు రీ యింబర్స్‌మెంట్, వితంతు, వికలాంగ, వృద్ధాప్య పింఛన్లు, ఉచిత విద్యుత్‌లతో వై ఎయస్ఆర్ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచారని, ఆ పథకాలు సరిగా అమలుకావాలంటే జగన్ సీఎంకావాలని ఆకాంక్షించారు.2014 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చే శారు. కాంగ్రెస్ పార్టీ సీబీఐని పావుగా వా డుకుంటోందని దుయ్యబట్టారు. వైయస్ఆర్ సీపీ యువతకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి రావడానికి జిత్తులమారి వేశాలు వేస్తున్నారని విమర్శించారు. వాటిని ప్రజలు నమ్మబోరన్నారు. సమావేశంలో రైతు కూలీ సంఘం అధ్యక్షుడు టుంగుటూరి రాధాకృష్ణ, స్టీరింగ్ కమిటీ సభ్యులు బాలకృష్ణ, పుల్లూరి వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు మేకల వెంకటేష్, ఉపాధ్యక్షుడు సుద్దాల నర్సయ్య, నాయకులు అఫ్జల్, సుధాకర్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.పలువురి చేరికఈ సందర్భంగా మండలంలోని కాశిరెడ్డిపల్లె గ్రామంలో చెందిన పలువురు మహిళలు పార్టీలో చేరారు. వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోడ జనార్దన్ మాట్లాడుతూ.. కనీస సౌకర్యాలు లేక గ్రామీణ వ్యవస్ధ ఛిన్నాభిన్నమవుతోందని అన్నారు. గ్రామానికి 40 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందోనని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సింగతి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అర్సం మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి సుధాకర్, యువజన అధ్యక్షుడు వెంబడి సత్తయ్య, రైతు సంఘం అధ్యక్షుడు బాకం రాంబాబు, నాయకులు వెంబడి రాజ్‌కుమార్, తోట అశోక్ కుమార్, కందుల రాజేష్, విజయ్, అనిల్, మొగిలి పాల్గొన్నారు.కార్యకర్తలకు అండగా ఉంటాతాడిపత్రి: కార్యకర్తలకు అందుబాటులో ఉండి అండగా నిలుస్తానని వైయస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వీఆర్ రామిరెడ్డి భరోసా ఇచ్చారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే పది నిమిషాల్లోనే కార్యకర్తల ముందు ఉంటానన్నారు. స్థానిక ఆస్పత్రి పాళెంలోని వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వీఆర్ మాట్లాడారు. 2014 ఎన్నికల్లో తాడిపత్రి స్థానంలో పార్టీని గెలిపించి.. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు కానుకగా అందిస్తామని చెప్పారు.సమస్యలు పట్టని సర్కార్ : ఎమ్మెల్యే గురునాథరెడ్డిరాష్ర్ట ప్రభుత్వం రైతులు, ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించిందని అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక శ్రీరాముల పేటలోని నియోజకవర్గ ఇన్‌చార్జ్ వీఆర్ రామిరెడ్డి స్వగృహంలో సోమవారం సాయత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే రైతుల సమస్యలపై అరగంట సమయం కూడా ప్రభుత్వం కేటాయించకపోవడం శోచనీయమన్నారు.నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా పట్టించుకునేనాథుడే లేడన్నారు. తాడిపత్రి ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ వేరే ప్రాంతాలకంటే ఈ ప్రాంతాల్లో అధి క ధరలకు అమ్మడం శోచనీయమన్నారు. కర్మాగారాల వల్ల నీరు, వాతావరణం కలుషితం కా వడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నార ని, పంటలు దెబ్బతింటున్నాయని ఆరోపిం చారు. ఆయా కర్మాగారాల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడంలేదన్నారు.వైయస్ మరణానంతరం కుంటుపడిన అభివృద్ధిఆత్మకూరు: మహానేత రాజశేఖరరెడ్డి మరణానంతరం సంక్షేమ పథకాలు నీరుగారాయని, అభివృద్ధి కుంటుపడిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఆత్మకూరులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రామాలలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలు తిష్ట వేశాయన్నారు.వైయస్ సీఎంగా ఉన్నప్పుడు పీఏబీఆర్ నుంచి నీటి పథకాలు అమలు చేసినట్లు గుర్తు చేశారు. జేసీ నాగిరెడ్డి పథకం ద్వారా రాప్తాడు, ఆత్మకూరు, కనగానపల్లి, అనంతపురం రూరల్, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలకు తాగునీటిని అందించేందుకు అప్పుడే ప్రతిపాదించినట్లు తెలిపారు. వైయస్ చనిపోయాక జిల్లా మంత్రులు వాటి గురించి ఏమాత్రమూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లాలో చంద్రబాబు పాదయాత్రసినీ ఫక్కీలా సాగనుందన్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఎలాంటి డైలాగులు వాడాలి, పాదయాత్ర ఎలా చేయాలని సినీ దర్శకులను అడిగి తెలుసుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలను ఎలా మభ్యపెట్టాలనే ఆలోచన తప్పా అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ మునిగిపోయే నావని, ‘తమ్ముళ్లు’ ఆ పార్టీ వీడి వైయస్ఆర్ సీపీలో చేరాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు. కార్మిక శ్రేయస్సే లక్ష్యం బూర్గంపాడు: దివంగత మహానేత వైయస్ ఆశయ సాధనలో భాగంగా కార్మిక సంక్షేమానికి వైయస్‌ఆర్ ట్రేడ్ యూని యన్ కృషి చేస్తుందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలిసభ్యుడు చందా లింగయ్య అన్నారు. ఈ నెల 26న సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీ మెయిన్ గేట్ వద్ద బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. కొన్ని కార్మిక సంఘాల నాయకులు సిఫార్సు చేసిన వారిని మాత్రమే పర్మినెంట్ చేస్తున్నారని, అర్హులైన మిగతా కార్మికులకు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సంస్థ లాభాలలో 25శాతం మొత్తాన్ని కార్మికులు, స్థానికుల సంక్షేమానికి యాజమాన్యం ఖర్చు చేయడం లేదని విమర్శించారు. ఐటీసీ కార్మికుల సంక్షేమానికి యూనియన్ కృషి చేస్తోందన్నారు. 26న జరిగే సభలో వైఎస్‌ఆర్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్, సీజీసీ సభ్యుడు కెకె.మహేంద్రరెడ్డి, నాయకుడు రవీంద్రనాయక్ తదితరులు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీ ఎంప్లాయిస్ అండ్ బదిలీస్ యూని యన్ అధ్యక్ష, కార్యదర్శులు గాదె వెంకటరెడ్డి, సుందర్‌రామ్, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సానికొమ్ము బ్రహ్మారెడ్డి, నాయకులు దుగ్గెంపూడి శేషిరెడ్డి, మందలపు సత్యనారాయణ, ట్రేడ్ యూనియన్ నాయకులు బి.నాగులు, నర్సింహారావు, సానికొమ్ము శంకర్‌రెడ్డి, దారం సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ధరలు తగ్గించకపోతే ఉద్యమిస్తాం : భానువత్సవాయి: ప్రజలపై పన్నుల రూపంలో భారం మోపే అసమర్ధ ప్రభుత్వంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వైయస్ఆర్ సీపీ కన్వీనర్ సామినేని ఉదయభాను చెప్పారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి ప్రజలను పాలించే నైతిక హక్కు లేదని, తక్షణమే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం వల్ల పేదలపై అదనపు భారం పడుతోందన్నారు. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆర్టీసీ చార్జీలను పెంచడం కాని, ప్రజలపై పన్నుల భారం మోపడం కాని చేయలేదన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. పార్టీ మండల పరిశీలకుడు తన్నీరు నాగేశ్వరరావు, కన్వీనర్ వడ్డే పరమయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు భూక్యా రాజానాయక్ తదితరులు పాల్గొన్నారు.సీఎం పర్యటనను అడ్డుకుంటాంవిజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మోసపూరిత వాగ్దానాలతో జిల్లా ప్రజలను వంచించారని, వాటిపై ఆయన సరైన సమాధానాలు చెప్పకపోతే ఇందిరమ్మ బాటను అడ్డుకుంటామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను స్పష్టం చేశారు. జిల్లాలో అభివృద్ధి జరిగింది వైయస్ఆర్ హయాంలోనేనని తెలిపారు. మచిలీపట్నం పోర్టు, పులిచింతల ప్రాజెక్టు, డెల్టా ఆధునికీకరణ, జిల్లాకు యూనివర్సిటీ కేటాయింపు, నూజివీడులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు వంటి వాటికి ఆయన హయాంలోనే శ్రీకారం చుట్టారని చెప్పారు. ఆయన మరణానంతరం జిల్లా అభివృద్ధి కుంటుపడిందన్నారు. వైఎస్ చేపట్టిన కార్యక్రమాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.