వాడవాడలా మహానేతకు నివాళి

మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మూడో వర్థంతి సందర్భంగా ఆదివారంనాడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. అన్న, రక్తదానాలు, రోగులకు పళ్ళు పంపిణీ, తదితరాలను చేపట్టారు. అన్ని గ్రామాలలో మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆదిలాబాద్ : మందమర్రిలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరెడ్డికి నివాళులర్పించారు. ఆదిలాబాద్‌లో వైఎస్సార్ సీసీ కార్యాలయంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి అనిల్‌కుమార్ వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సలీంపాషా పాల్గొన్నారు. నిర్మల్‌లో వైఎస్సా ర్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్ముల వినాయక్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లాడి వెంకటరమణ ఆధ్వర్యంలో మో టార్ సైకిళ్లపై శాంతిర్యాలీ నిర్వహించారు. చర్చిలో ప్రార్థనలు చేశారు.

భైంసా మండలం మహాగావ్‌లో జిల్లా కో కన్వీనర్ రవిప్రసాద్ ఆధ్వర్యంలో 40 మంది వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 200 మంది యువకులు పార్టీలో చేరారు. తలమడుగు, సుంకిడిలో గ్రామస్తులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. తాంసి, పిప్పల్‌కోటిలో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి సోయం బాపురావు పాల్గొన్నారు. మంచిర్యాలలో నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్తినేని రవికుమార్ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తా వద్ద వైఎస్ చిత్రపటం వద్ద నివాళులర్పించి, రోగులకు పండ్లు, పేద విద్యార్థులకు పెన్సిళ్లు, నోటుబుక్‌లు పంపిణీ చేశారు. సిర్పూర్(టి)లో నియోజకవర్గ ఇన్‌చార్జి బ్రహ్మయ్య, ఆసిఫాబాద్‌లో మండల కన్వీనర్ కె. మోహన్, బెల్లంపల్లిలో నియోజకవర్గ సమన్వయకర్త నర్సింగ్‌రావు, పట్టణ కన్వీనర్ మేకల వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఉట్నూర్‌లో మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కలీంపాషా ఆధ్వర్యంలో వైఎస్సార్‌కు నివాళులర్పించారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..

కాగజ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు మహానేతకు నివాళులర్పించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సి. రాంచంద్రారెడ్డి, నిర్మల్‌లో మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేరడిగొండలో నియోజకవర్గ ఇన్‌చార్జి జాదవ్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బెల్లంపల్లిలో మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్వర్ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

అనంతపురంలో..

అనంతపురం: వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు దివంగత నేత విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో రోగులకు బ్రెడ్డు, పాలు పంపిణీ చేశారు. అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలకు నిత్యావసర సరుకులను అందజేశారు.

దేవాలయాలు, మసీదులు, చర్చిలతో పాటు వాడవాడలా అన్నదానాలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత నగరంలోని వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. లారీ ఓనర్స్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో 108 మంది లారీ డ్రైవర్లు, క్లీనర్లు, యజమానులు రక్తదానం చేశారు.
తపోవనం బైపాస్‌లో లారీ ఓనర్స్ ఆధ్వర్యంలోనూ, రుద్రంపేటలో వైఎస్సార్‌సీపీ నేత నరేంద్రరెడ్డి నేతృత్వంలోనూ భారీఎత్తున అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్డు, పాలు పంపిణీ చేశారు. నగరంలోని వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో అన్నదానం చేసి.. నిత్యావసర సరకులను కూడా అందించారు. పెనుకొండలో వైఎస్సార్‌సీపీ భారీ బహిరంగసభను నిర్వహించి.. మహానేతకు ఘనంగా నివాళులర్పించింది.

ఇదే సభ వేదికగా మూడు వందల కుటుంబాలు వైఎస్సార్‌సీపీలోకి చేరాయి. ఈ సభలోనే పరిటాల రవి బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పరిహారం పంపిణీ చేశారు. ఆత్మకూరు మండలం తలుపూరులో వైఎస్ విగ్రహాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ, ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి, సీజీసీ సభ్యులు తోపుదుర్తి కవిత, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి ఆవిష్కరించారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాయదుర్గంలో మొక్కలు నాటారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్‌సీపీ నేతలు మచ్చన్న, దొడగట్ట క్రిష్టప్ప, కాంచనగంగ, రామన్న, పూజారి నాగరాజు తదితరుల నేతృత్వంలో ప్రజలు మహానేతకు నివాళులర్పించారు. పార్టీ సీఈసీ సభ్యు డు వై.విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో ఉరవకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ మహానేత వర్ధంతి నిర్వహించారు. తాడిపత్రిలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ వీఆర్ రామిరెడ్డి, సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య నేతృత్వంలో భారీఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

శింగనమల నియోజకవర్గంలో వైఎస్ వర్ధంతి సభల్లో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, గుంతకల్లు నియోజకవర్గంలో వై.వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. కదిరిలో వైఎస్సార్‌సీపీ నేతలు షాకీర్, జొన్నా రామయ్య, ఇస్మాయిల్, వేమల ఫర్హానా తదితరుల నేతృత్వంలో మహానేతకు నివాళులర్పించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్‌రెడ్డి, ఎస్వీ సోమశేఖరరెడ్డి నేతృత్వంలో వాడవాడలా అన్నదానాలు నిర్వహించారు.

హిందూపురం నియోజకవర్గంలో పార్టీ నేతలు చౌళూరు రామకృష్ణారెడ్డి, కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, జహీరుద్దీన్, రెహమాన్ తదితరుల నేతృత్వంలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రోగులకు బ్రెడ్డు, పాలు పంపిణీ చేశారు. మడకశిర నియోజకవర్గంలో వాడవాడలా ప్రజలు, వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్‌కు నివాళులర్పించారు.

వైఎస్ పేరు ఉచ్చరించే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు

ఉరవకొండ: ‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పెట్టిన రాజకీయ భిక్షతో ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు పదవులు అనుభవిస్తున్నారు. అలాంటి వారిలో కొందరు నేడు వైఎస్‌పైన, ఆయన కుటుంబంపైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారికి వైఎస్ పేరును ఉచ్ఛరించే అర్హత కూడా లేదు’’ అని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా ఉరవకొండలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం బహిరంగ సభలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో నా యుకులు వీరన్న, తేజోనాథ్, అశోక్, సుంకన్న, బసవరాజు, తిప్పయ్యు, రాజ్‌కువూర్, వన్నప్ప, ప్రతాప్, ఈడిగప్రసాద్, లత్తవరం గోవిందు, తిరంపురం వెంకటస్వామి, కరి బసి, చందా రావుు, జిలకర మోహన్, పెద్దన్న, తులసీ, నింబగల్లు తివ్మురాజు, గోపాల్‌రెడ్డి, వెలిగొండ నరసింహులు పాల్గొన్నారు.

గానామృతంతో వైఎస్‌కు నివాళి

‘ఎక్కడకి పోతావు రాజన్న.. ప్రజల హృదయాలనొదిలిపెట్టి’..నీ స్థానం చరిత్ర పుటల్లో కాదు ప్రజల మనస్సుల్లో అంటూ హృద్యంగా సాగిన పాటలతో గాయకులు దివంగత ముఖ్యమంత్రి మహానేత రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. సామాన్యుని హృదయాంతరాల్లో నిండిన కృతజ్ఞతాభావాన్ని పాటల రూపంలోకి మార్చి తమదైన మధుర గాత్రంతో అలరించిన రిలాక్స్ నాగరాజు బృందం ఆహూతులను ఆకట్టుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో స్థానిక కృష్ణకళామందిర్‌లో నిర్వహించిన పాటల నీరాజనం వైఎస్సార్ రూపాన్ని ప్రజల ముందు సజీవంగా నిలబెట్టింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గురునాథరెడ్డి, వైఎస్సార్ సిపి నేతలు ఎర్రిస్వామిరెడ్డి, పైలా నరసింహయ్య, విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, గిర్రాజు నగేష్, చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాలీబాయ్స్ ఆర్కెస్ట్రా వాయిద్యాల హోరులో కిశోర్, నాగేంద్ర, సత్యభరణి, శ్రీనివాస్ తదితరులు అద్భుతమైన గాత్రంతో ఆకట్టుకున్నారు. లక్ష్మీనారాయణ, కృపాకర్, భాస్కర్, అన్వర్, గిరి వాయిద్య సహకారం మందించగా గాయనీ గాయకులు తమదైన ఆలాపనలతో అలరించారు.

నిజమైన లీడర్ వైఎస్

‘‘రాష్ట్ర భవిష్యత్తును పదేళ్ల ముందే ఊహించి వివిధ పథకాలకు రూపకల్పన చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. నిజమైన లీడర్‌కు నిలువెత్తు నిదర్శనం ఆయన’’ అని ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి కొనియాడారు. వైఎస్సార్ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం యూనివర్సిటీలో వైఎస్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వీసీతోపాటు రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, ఆచార్య రమణారెడ్డి హాజరయ్యారు. ఫార్మసీ కళాశాల ఆవరణలో వైఎస్ నిలువెత్తు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రాంగణం ముందుభాగంలో వీసీ మొక్కలు నాటి నీళ్లుపోశారు. వైఎస్‌ఆర్‌ను గుర్తు చేసుకున్న వికలాంగులు మేము సైతం అంటూ ట్రై సైకిళ్లలో వచ్చి మొక్కలు నాటి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో బోధనేతర సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డితోపాటు రామనారాయణరెడ్డి, కేశవరెడ్డి, మునిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, నారాయణస్వామి, బాలక్రిష్ణారెడ్డి, వెంకటరమణ, వైఎస్‌ఆర్‌టీయూ ఎస్సీ పెద్దన్న, విద్యార్థి నాయకులు లింగారెడ్డి, నరసింహారెడ్డి, నారాయణరెడ్డి, జయచంద్రారెడ్డి, గాజుల వెంకటేష్, లాలెప్ప, పులిరాజు, మల్లికార్జున, రవి, సుభాష్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

అందరి బంధువు వైఎస్

అందరి బంధువు వలె.. అన్ని వర్గాల వారి అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి కొనియాడారు. బతుకులపై భరోసా ఇచ్చే ఆయన చిరునవ్వు, నేనున్నా... అనేలా ఆయన రూపాన్ని ప్రజలు ఇప్పటికీ ఎప్పటికీ మరువలేరన్నారు. వైఎస్ మూడో వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పార్టీ నేతలతో కలిసి నగరంలోని నందిని హోటల్ ఎదురుగా ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహానేత ఆశయ సాధన కోసం నడుంబిగించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అన్ని వర్గాలు ఆశీర్వదించి అక్కున చేర్చుకోవాలని కోరారు.

వారికి వైఎస్ పేరు ఉచ్ఛరించే అర్హత లేదు

విశ్వాసఘాతకులైన కాంగ్రెస్ పార్టీ నేతలకు మహానేత వైఎస్ పేరును ఉచ్ఛరించడానికి కూడా అర్హత లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. మహానేత సువర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలబడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వర్‌రెడ్డి, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, పార్టీ ముఖ్య నేతలు బి.ఎర్రిస్వామిరెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, సాలార్‌బాషా, మీసాల రంగన్న, బోరంపల్లి ఆంజనేయులు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, వీరాంజనేయులు, లింగాల రమేష్, ఎం.చంద్రప్ప, రంగంపేట గోపాల్‌రెడ్డి, ఎస్‌వీ రమణ, అబుసలేహా, విద్యాసాగర్‌రెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, నార్పల రఘు, లీగల్‌సెల్ నారాయణరెడ్డి, తలమర్ల శ్యాంసుందర్, బోయ సుశీలమ్మ, ఉషారాణి, శ్రీదేవి, దేవి, ప్రమీల, పార్వతి, నిర్మల, అట్టెనాగరాజు, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.

ఫీజు దీక్షను విజయవంతం చేయండి

అనంతపురం: పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్‌‌సమెంట్ వర్తింపజేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో హైదరాబాద్‌లో చేపట్టే ఫీజు దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆదివారం రుద్రంపేటలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నరేంద్రరెడ్డి ఏర్పాటు చేసిన మహా అన్నదాన, రక్తదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ధనుంజయయాదవ్ తదితరులు వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 25 మంది రక్తదానం చేశారు. మూడు వేలమందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర కమిటీ అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, నాయకులు పురుషోత్తం, ప్రసాద్‌రెడ్డి, బాలిరెడ్డి, వర్మ, శివారెడ్డి, క్రిష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి, ల క్ష్మిరెడ్డి, నందీశ్వర్‌రెడ్డి, మునిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతిలో..
తిరుపతి: జిల్లాలో పార్టీలకతీతంగా మహానేత వర్థంతిని నిర్వహించారు. ప్రతి పల్లె వైఎస్సార్‌ను స్మరించుకుంది. ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సంక్షేమ ఫలాన్ని అందించిన మహానేతకు ఆదివారం జిల్లా ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు చిత్తూరులో వైఎస్సార్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మారుమూల గ్రామాల్లో రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, మహిళలు ఇళ్లలో చిత్రపటాలకు, మరి కొందరు క్యాలెండర్‌లో ఉన్న వైఎస్‌ఆర్ బొమ్మకు పూజలు చేసి నివాళి అర్పించారు.

ఆదర్శప్రాయుడు వైఎస్సార్: భూమన

తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో తుడ సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వైఎస్సార్ ఆదర్శప్రాయుడని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని పేర్కొన్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, పేదలకు అన్నదానం చేశారు. మదనపల్లిలో ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో బధిరుల పాఠశాలల్లో అన్నదానం చేశారు. అనంతరం పిల్లలకు ఉచిత వైద్యసేవలు అందించారు. నగరిలో కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్‌కే రోజా ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు. వర్ధంతిని పురస్కరించుకుని నగరి సత్రవాడలో 200 మంది, మండల పరిధిలోని ఓజీ కుప్పం, కేజీ కుప్పం, క్రిష్ణాపురం గ్రామాల నుంచి 600 మంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి పుత్తూరు, గంగాధరనెల్లూరు, తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చెవి రెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘ నంగా నివాళులర్పించారు.

వర్ధంతి సందర్భం గా నియోజకవర్గంలోని 150 గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన చెవి రెడ్డిని అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రైవేటు స్థలంలో ఆరు గ్రామాల్లో మా త్రం విగ్రహాలు ఏర్పాటు చేశారు. సత్యవేడులో నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలం ఆధ్వర్యం లో, చిత్తూరులో ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో పట్టణం, రూరల్ ప్రాంతాల్లోని పలుగ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలు వేసి ఘనం గా నివాళులర్పించారు. అనంతరం పలుచోట్ల అన్నదానం చేశారు. జిల్లా మహిళా కన్వీనర్ గాయత్రీదేవి పాఠశాలల్లో వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కుప్పం నియోజకవర్గంలో జెడ్పీ మాజీ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి ఆధ్వర్యంలో మండల కన్వీనర్లు, కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.

శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో వసతి గృహాల్లోని విద్యార్థులకు దుస్తులు, బ్యాగులు, ఫ్యాన్లు, పుస్తకాలు, ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పలమనేరులో మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి, తంబళ్లపల్లెలో కలిచర్ల ప్రభాకర్‌రెడ్డి, పూతలపట్టు, పీలేరు తదితర ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లు, జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు. బి.కొత్తకోట మండలం శంకరాపురంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పలమనేరులో కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాములురెడ్డి వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. మదనపల్లె పరిధిలోని తట్టివారిపల్ల్లెలో జిల్లా పార్టీ యువత అధ్యక్షుడు ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మండల కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లు, జిల్లా కమిటీ సభ్యులు మహానేత విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పలు సేవా కార్యక్రమాలు చేశారు.

Back to Top