బడా బాబులను వదిలి చిన్నచేపలపై కేసులా..?

హైదరాబాద్ః
కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఉన్న ఏ ఒక్కర్నీ వదలవద్దని
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అధికార పార్టీకి చెందిన బడా బాబులను వదిలి చిన్నచేపల మీద కేసులు
పెడుతున్నారని ఆమె ఫైరయ్యారు. పార్టీల కతీతంగా కాల్ మనీ సెక్స్ దందాలో
ఎవరున్నా వారిపై చర్యలు చేపట్టి శిక్షించాలన్నారు. మహిళాసంఘాలు,
ప్రతిపక్షాల పిలుపు మేరకు వందలాది మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి మేమే
బాధితులం అని చెబుతున్నారని కల్పన చెప్పారు. వారిపై దాడులు చేసే ప్రమాదం
ఉన్నందున రక్షణ కల్పించాలని సీపీని కోరారు. 

రాష్ట్రవ్యాప్తంగా
సంచలనం సృష్టించిన  కాల్ మనీ సెక్స్ వ్యవహారాన్ని ప్రధాన అంశంగా తీసుకొని
అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాడుతామని ఉప్పులేటి కల్పన తెలిపారు. పచ్చచొక్కాలను కేసు నుంచి తప్పించేందుకు సీపీని సెలవుమీద పంపిన
ప్రభుత్వం...ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి రావడంతో  ఆలోచనను
విరమించుకుందన్నారు. కాల్ మనీ వ్యవహారంపై సిట్ వేసి సమగ్రంగా దర్యాప్తు
జరిపించాలన్నారు. మహిళలతో బలంవంతంగా వ్యభిచారం చేయించడమే గాక..వాళ్ల
ఆస్తుల్ని జప్పు చేసి శారీరకంగా,మానసికంగా హింసించిన కర్కశులను కఠినంగా
శిక్షించాలన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top