త్వరలో మంచిరోజులు వస్తాయి: షర్మిల

గుంటూరు 01 మార్చి 2013:

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల శుక్రవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని అనుపాలెం గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లు, ఇళ్లు, విద్యుత్తు సమస్యలపై గ్రామస్థులు తమ గోడును ఆమెకు వెళ్ళబుచ్చారు.  శ్రీమతి షర్మిల మాట్లాడుతూ బాబు హయాంలో రైతులు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేదనీ, అదే దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి  పాలనలో రైతులకు అంతా మంచే జరిగిందనీ చెప్పారు. ఫీజు రీయింబర్సుమెంట్ లేక విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న రాజ్యంలో రైతులకు, విద్యార్థులకు మళ్లీ మంచిరోజులు వస్తాయని, విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపవద్దని షర్మిల సూచించారు.

Back to Top