అసలు దొంగలు బాబు గ్రూప్ సభ్యులే

శ్రీకాకుళం : నకిలీ నాణాల మూలాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోఉన్నాయని మాజీ మంత్రి, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళంలో అరెస్ట్ అయిన నిందితులకు ఆ స్థాయి లేదని ఆయన అన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, శ్రీకాకుళం జిల్లా రహస్య పర్యటన, ఎస్పీతో చర్చల వెనుక ఆంతర్యంపై విచారణ చేపట్టాలని తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. ఈ వ్యవహారమంతా లింగమనేని ఎస్టేట్ కేంద్రంగా జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. నకిలీ నాణాల కేసులో రూ.20 నుంచి రూ.30 కోట్ల మేరకు డీల్ జరిగిందని తమ్మినేని తెలిపారు.  నకిలీనాణాల కేసులో సీతంపేట మండలం దోనుబాయి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ పి. రామకృష్ణతోపాటు, కానిస్టేబుల్‌ పి. శ్రీనులను అరెస్ట్ చేశారు. ఈనెల 3వ తేదీన నకిలీ ఇరీనియం నాణాలు, మహిమగల ఇతర వస్తువుల పేరుతో నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. అయితే వారికి సహకరించారనే ఆరోపణలతో పోలీసులను అరెస్ట్ చేశారు.

Back to Top