ఎమ్మెల్యే రోజా అంశంలో నేటి ప‌రిణామాలు

హైద‌రాబాద్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ నేడు ఒక దుర‌దృష్ట‌క‌ర అంశానికి తెర లేవ‌నుంది. ప్ర‌తిప‌క్ష మ‌హిళా ఎమ్మెల్యే రోజా ను స‌భ‌లోకి అనుమ‌తించాలంటూ గౌర‌వ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద నేడు చ‌ర్చ జ‌ర‌పనున్నారు. ఒక ఉన్న‌త న్యాయ‌స్థానం వ్య‌వ‌హార శైలిని టీడీపీ రాజ‌కీయ నాయ‌కులు విచార‌ణ జ‌రిపి తీర్పు ఇవ్వ‌నున్నారు. ఈ దౌర్భాగ్య‌క‌ర‌మైన వ్య‌వ‌హారానికి వైఎస్సార్సీపీ దూరంగా ఉండ‌నుంది.
అటు, హైకోర్టు ఆదేశాల్ని టీడీపీ ప్ర‌భుత్వం శాస‌న‌స‌భ‌ను అడ్డు పెట్టుకొని తుంగ‌లోకి తొక్కిన తీరును రోజా త‌రుపు న్యాయ‌వాదులు హైకోర్టు దృష్టికి తీసుకొని రానున్నారు. కోర్టు ధిక్కార‌నేరం కింద విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరుతున్నారు. అటు, ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాదులు ఈ ఆదేశాల మీద డివిజ‌న్ బెంచ్ ముందు వాద‌న‌లు వినిపించే అవ‌కాశం ఉంది. 
Back to Top