తిరుపతిని పట్టించుకోని చిరు టూరిజాన్ని ఉద్ధరిస్తాడా?

తిరుపతి, 11 నవంబర్‌ 2012: రాజకీయంగా లబ్ధి పొందేందుకే తిరుపతిని దత్తత తీసుకుంటానంటూ కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కొనిదెల చిరంజీవి ప్రకటించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన తిరుపతి అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఆదివారం ఇక్కడ దుయ్యబట్టారు. చిరంజీవి పచ్చి మోసగాడని భూమన ఎద్దేవా చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని పట్టించుకోని వ్యక్తి ఇక దేశంలో పర్యాటక రంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని భూమన సూటిగా ప్రశ్నించారు.
Back to Top