‌రెచ్చగొట్టేలా విహెచ్ వ్యాఖ్యలు: భూమన

తిరుపతి, 18 ఆగస్టు 2013 :

సీమాంధ్రులను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు వ్యాఖ్యలు ఉన్నాయని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమనక కరుణాకరరెడ్డి వ్యాఖ్యనించారు. రాష్ట్ర విభజనతో అన్యాయం జరిగి తీవ్రంగా ఉద్యమిస్తున్న సీమాంధ్రులను రెచ్చగొట్టడం విహెచ్‌కు తగదని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అంశం ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయాన్ని విహెచ్ గుర్తుంచు‌కుంటే మేలు అని ఆయన హెచ్చరించారు. తిరుపతిలో‌ శనివారంనాడు విహెచ్ వ్యాఖ్యలు సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఆగ్రహానికి కారణమైందని భూమన అన్నారు.

కాగా, విహెచ్ అనుచిత వ్యాఖ్యలకు శాంతియుతంగా నిరసన తెలిపిన సీమాంధ్ర ఉద్యమకారులపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఉద్యమకారులను అరెస్టు చేయడం వెనుక సిఎం కిరణ్ కుమా‌ర్ రెడ్డి హస్త‌ం అందని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనపై రాజకీయాలు చేసినా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని భూమన హెచ్చరించారు.

తాజా ఫోటోలు

Back to Top