తిరుమలకు మహిళల పాదయాత్ర

మదనపల్లె:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డికి బెయిల్ మంజూరు కావాలని కోరుతూ మదనపల్లె నుంచి తిరుమలకు పార్టీ మహిళా నేతలు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్‌ తిప్పారెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్సీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు సద్భుద్ధి ప్రసాదించాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని వేడుకోనున్నట్లు చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ జిల్లా మహిళా కన్వీనర్ గాయత్రీదేవి మాట్లాడుతూ శ్రీ జగన్మోహన్‌ రెడ్డికి బెయిల్ మంజూరు కావాలనీ, శ్రీమతి వైయస్ షర్మిల ఆరోగ్యం కుదుటపడి మరో ప్రజాప్రస్థాన పాదయాత్ర ప్రారంభించాలని కోరుతూ ఈ పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు.

తాజా వీడియోలు

Back to Top