చంచల్‌గూడ జైలు వద్ద మూడంచెల భారీ భద్రత

హైదరాబాద్, 24 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రియతమ జననేతను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చంచల్‌గూడ జైలు వద్దకు తరలి వస్తున్నారు. భారీగా తరలివస్తున్న అభిమాన జనసందోహాన్ని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు జైలు వద్ద మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒక కంపెనీ బిఎస్ఎఫ్, మూడు ప్లాంటూన్ల ఎపిఎస్‌పి బలగాలతో పాటు సౌత్ జో‌న్లోని 17 పోలీ‌స్ స్టేషన్ల‌ సిబ్బందిని చంచల్‌గూడ జైలు వద్ద మొహరించారు. ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Back to Top